Tirumala Tirupati Devasthanam: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఇందులో చర్చించారు. టీటీడీకి సంబంధించిన ఆస్తుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం టీటీడీ ఆస్తులు 960.. వాటి విలువ రూ.85,705 కోట్లు. గతంలో 114 ఆస్తులు అమ్మేశారు. 2014 నుంచి భూముల క్రయ విక్రయాలు జరగలేదు.

Tirumala Tirupati Devasthanam: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

Tirumala Tirupati Devasthanam

Updated On : September 24, 2022 / 2:33 PM IST

Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఇందులో చర్చించారు. టీటీడీకి సంబంధించిన ఆస్తుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం టీటీడీ ఆస్తులు 960.. వాటి విలువ రూ.85,705 కోట్లు. గతంలో 114 ఆస్తులు అమ్మేశారు. 2014 నుంచి భూముల క్రయ విక్రయాలు జరగలేదు.

నైవేద్యం తయారీకి అవసరమైన ముడి సరుకులు రైతు సాధికారిక సంస్థ ద్వారా కొనుగోలుకు ఎమ్ఓయూ చేసుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా వసతికి చాలా ఇబ్బందిగా ఉన్నట్లు గుర్తించామని, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా గోవర్ధన్ సత్రాల వెనుక రూ.95 కోట్లతో 10 వేల మందికి 5వ పీఏసీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. వకుళమాత ఆలయం నుంచి రూ.30 కోట్లతో జూపార్కు రోడ్డు వరకు రహదారి నిర్మాణం, నందకం రెస్ట్ హౌస్ లో 340 గదుల్లో కొత్త ఫర్నిచర్ ఏర్పాటుకు రూ.2.40 కోట్ల కేటాయింపు, సామాన్యులు బస చేసే గదుల్లో రూ.7.20 కోట్లతో గీజర్లు, ఫర్నీచర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

నెల్లూరులో రూ.3 కోట్లతో కల్యాణ మండపం ఆలయం నిర్మాణం. టీటీడీ ఉద్యోగులకు యూనిఫాం కొనుగులుకు 2.5 కోట్లు, ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ కి రూ.6.30 కోట్లు కేటాయింపు, టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం అదనంగా రూ.25 కోట్లతో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తిరుమలలో రద్దీ తగ్గించడానికి తిరుపతిలో సర్వదర్శనం 25 వేలు టోకెన్లు బ్రహ్మోత్సవాలు తరువాత ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామని టీటీడీ పాలక మండలి చెప్పింది.బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు ఉంటాయని, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనం ఇస్తామని తెలిపింది. సామాన్యుల ఇబ్బందుకు దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాల తరువాత అమలు చేస్తామని పేర్కొంది. భవిష్యత్తులో వసతి బుకింగ్ తిరుపతికి మార్చాలని యెచిస్తున్నామని చెప్పారు.

Rohit Sharma: టీ20ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ.. ఎన్ని సిక్స్‌లు కొట్టాడంటే?