Rohit Sharma: టీ20ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ.. ఎన్ని సిక్స్‌లు కొట్టాడంటే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు.

Rohit Sharma: టీ20ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ.. ఎన్ని సిక్స్‌లు కొట్టాడంటే?

Rohit sharma

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు. టీ20 ఫార్మాట్ లో సిక్సర్ల మోతమోగించి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఇక శుక్రవారం నాగపూర్ లో జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ లో రోహిత్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే బ్యాట్స్‌మెన్ గా తన సత్తాను మరోసారి చాటాడు.

India vs Australia Match: రేపు భాగ్యనగరంలో భారత్ – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. ఫైనల్ పోరుకు ముస్తాబైన ఉప్పల్ స్టేడియం..

టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బౌలరైన జోష్ హెజిల్వుడ్ మొదలుకొని పాట్‌కమిన్స్, ఆడమ్ జంపా, డేనియల్ సామ్స్ అందరి బౌలింగ్ లో దంచికొట్టాడు. 20 బంతుల్లోనే 46 పరుగులు చేసిన రోహిత్.. నాలుగు భారీ సిక్సర్లు, నాలుగు బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వరల్డ్ రికార్డును నెులకొల్పాడు.  టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ సిక్సర్ల వీరుడిగా ఘనత సాధించాడు. భారత్ ఇన్నింగ్స్ లో భాగంగా హెజిల్వుడ్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ ఎదుర్కొన్న రెండో బంతికే సిక్సర్ కొట్టాడు. దీంతో అతడు మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (172) ను అధిగమించాడు.

IndVsAus 2nd T20I : రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం

ఆ తర్వాత రోహిత్ మరో మూడు సిక్సర్లు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచారు. 176 సిక్సర్లతో తొలిస్థానంలో రోహిత్ శర్మ నిలవగా.. తరువాతి స్థానంలో మార్టిన్ గప్తిల్ (172), వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇయాన్ మోర్గాన్ (120), ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ (119)  తర్వాత స్థానాల్లో నిలిచారు.