టీడీపీకి మరో షాక్, వైసీపీలోకి మాజీ మంత్రి

ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు(జూన్

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 08:53 AM IST
టీడీపీకి మరో షాక్, వైసీపీలోకి మాజీ మంత్రి

ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు(జూన్

ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు(జూన్ 10,2020) ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు వీలుగా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మార్గం సుగమం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలోనే ఆయన వైసీపీలో చేరాలనుకున్నా .. అప్పట్లో సాధ్యపడకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

ప్రకాశంలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్:
ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష మళ్లీ స్టార్ట్ చేసిందనే ప్రచారం జోరందుకుంది. జిల్లాలోని మరికొంత మంది టీడీపీ ముఖ్యనేతలను వైసీపీలో లాక్కునేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించాయి. మాజీ మంత్రి శిద్దా వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. 

పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు టార్గెట్:
ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ ఆకర్ష్‌కు వైసీపీ తెరలేపింది. జిల్లాలో టీడీపీకి ముఖ్య నేతగా ఉన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ నేరుగా వైసీపీ తీర్థంపుచ్చుకోకపోయినా.. ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌ని దగ్గరుండి మరీ వైసీపీలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ.. వైసీపీ నేతలతో సమావేశం అవుతున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా తన అనుచరులతో సీఎం జగన్‌ని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీ కండువా కప్పుకుంది. వీరితో పాటు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, శిద్దా రాఘవరావు కూడా వైసీపీలో చేరుతున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో కరోనా ప్రబలడంతో అధికార పార్టీలో చేరికలు నిలిచిపోయాయి. అయితే మరోసారి జిల్లాలో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తెరమీదకు వచ్చింది.

మొత్తంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకులపై అధికార వైసీపీ మరోసారి కన్నేసింది. నెలాఖరులోపు పలువురు ముఖ్య నేతల్ని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జిల్లాలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.

Read: బార్లలో మద్యం అమ్మేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి