vizag steel plant : విశాఖలో వైసీపీకి ‘ఉక్కు దెబ్బ’..!
చాలా రోజుల తర్వాత.. కాదు.. చాలా నెలల తర్వాత.. విశాఖలో వైసీపీకి సెగ తగిలింది. అది మామూలు సెగ కాదు. ఉక్కు సెగ. ఎస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో.. వైసీపీ అనుబంధ కార్మిక సంఘం పోటీ చేయకుండానే.. ఓడిపోయింది.

Shock To Ycp In Vizag Steel Plant
shock to ycp in vizag steel plant : చాలా రోజుల తర్వాత.. కాదు.. చాలా నెలల తర్వాత.. విశాఖలో వైసీపీకి సెగ తగిలింది. అది మామూలు సెగ కాదు. ఉక్కు సెగ. ఎస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో.. వైసీపీ అనుబంధ కార్మిక సంఘం పోటీ చేయకుండానే.. ఓడిపోయింది. పోటీ చేయనప్పుడు.. ఓటమెలా సాధ్యమనుకోవద్దు. ఈ ఇష్యూని.. ఇలాగే అర్థం చేసుకోవాలి. వైసీపీ కీలక నేతలు ప్రచారం చేసినా.. రిజల్ట్ రివర్సే వచ్చింది. ఇదే ఎలక్షన్‌లో.. టీడీపీ అనుబంధ కార్మిక సంఘం సపోర్ట్ చేసిన యూనియన్ గెలవడం.. విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ రిజల్ట్.. స్థానిక రాజకీయాల మీద కూడా ప్రభావం చూపే చాన్స్ ఉందా? లేక.. దీనిని స్టీల్ ప్లాంట్ వరకే పరిమితం చేయాలా?
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేట్‌పరం చేసేందుకు.. ఏడాదిన్నరగా కేంద్రం చేయని ప్రయత్నమంటూ లేదు. ఉక్కు కార్మికులంతా.. వందల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కూడా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు.. పెద్దగా ప్రయత్నించకపోవడం కార్మికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇదే సమయంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో యూనియన్ ఎన్నికలు జరిగాయ్. వీటిలో.. వైసీపీకి ఉక్కు సెగ తాకిందనే చర్చ విశాఖలో జోరుగా సాగుతోంది.
Also read : Lagadapati Rajagopal : లగడపాటీ.. చేరబోయేది ఏ పార్టీ..?ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్..!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు.. ఏపీ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం, కార్మికుల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలతో.. వైసీపీకి అనుబంధ యూనియన్ ఈ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. నేరుగా బరిలోకి దిగకుండా.. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీకి మద్దతిచ్చింది. ఇక.. స్టీల్ ప్లాంట్ లోపల INTUC, బయట.. వైసీపీ నేతగా చలామణి అవుతున్న కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్.. INTUC ప్యానెల్ తరఫున పోటీ చేశారు. మరోవైపు.. AITUCకి టీడీపీ అనుబంధ కార్మిక సంఘం.. TMTUC మద్దతిచ్చింది. వైసీపీ మద్దతిచ్చిన INTUCకి, టీడీపీ సపోర్ట్ చేసిన AITUCకి మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఈ కీలక పోరులో 9 వేల మందికి పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఓట్లు వేశారు. వైసీపీ మద్దతిచ్చిన INTUCపై.. AITUC 466 ఓట్ల తేడాతో గెలిచింది. ఇది ఘన విజయమని.. ఉక్కు కార్మికులు చెబుతున్నారు. వైసీపీ కార్మిక సంఘం సపోర్ట్ చేసిన INTUCకి ఓటమికి.. స్టీల్ ప్లాంట్ సమస్యలపై.. జగన్ ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడం, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను.. గట్టిగా వ్యతిరేకించకపోవడం వల్లే.. కార్మికులు ఆగ్రహంతో ఇలా చేశారని వైజాగ్‌లో అంతా చర్చించుకుంటున్నారు.
Also read : Lagadapati Rajagopal : రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ..?! వైసీపీ ఎమ్మెల్యేతో చర్చలు..!
స్టీల్ ప్లాంట్ యూనియన్ ఎన్నికల్లో.. వైసీపీ తరఫున కీలక నేతలంతా ప్రచారం చేశారు. విశాఖ ఎంపీ.. ఎంవీవీ సత్యనారాయణ కూడా ఉక్కు గేటు దగ్గర సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ.. కార్మికులు వైసీపీ మద్దతిచ్చిన INTUC యూనియన్‌ని ఓడించారు. ఇక.. స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో.. తెలుగుదేశం అనుబంధ సంఘం TNTUC సంపూర్ణ మద్దతు పలకడంతో.. ఆ పార్టీ నాయకులు కూడా ప్రచారం చేశారు. AITUC విజయం సాధించడంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చక్రం తిప్పారు. వీరితో పాటు TNTUC అధ్యక్షులు విల్లా రాంమోహన్ కుమార్, ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్ బాబు.. స్టీల్ ప్లాంట్ విషయంలో.. వైసీపీ వైఖరి, ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ ఎంపీ రాంమోహన్ నాయుడు కూడా.. AITUCకి మద్దతుగా ప్రచారం చేశారు.
టీడీపీ అనుబంధ కార్మిక సంఘం మద్దతిచ్చిన ఏఐటీయూసీ గెలవడంతో.. విశాఖ ఉక్కు కార్మికుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో.. వైసీపీకి తెలిసొచ్చిందంటున్నారు. నిజానికి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలు చిన్న విషయమే అయినప్పటికీ.. అందులో అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘం పోటీ చేయకపోవడం, మరో యూనియన్‌కి మద్దతివ్వడం.. అది కూడా ఓటమిపాలవ్వడమనేది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది.. భవిష్యత్తులో.. విశాఖ జిల్లా రాజకీయాలపైనా.. ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికైనా.. కేంద్రంపై ఒత్తిడి పెంచి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటే బెటరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలాగే.. కంటిన్యూ అయితే.. వచ్చే ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రభావిత నియోజకవర్గాల్లోనూ.. గట్టి షాక్ తప్పదనే చర్చలు జరుగుతున్నాయి.