డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు : ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు
తెలంగాణ, ఏపీ మధ్య డేటా వార్ నడుస్తోంది. డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.

తెలంగాణ, ఏపీ మధ్య డేటా వార్ నడుస్తోంది. డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ మధ్య డేటా వార్ నడుస్తోంది. డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఐటీ గ్రిడ్, బ్లూ ప్రాగ్ తోపాటు మరిన్ని సంస్థలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీకి తెలంగాణ పౌరుల డేటా ఎలా వచ్చిందన్న దానిపై సిట్ దృష్టి పెట్టింది. సేవామిత్ర యాప్ ద్వారా ఎంత మంది పౌరుల సమాచారం రాబట్టారన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. నిపుణుల సమక్షంలో సిట్ దర్యాప్తు చేయనుంది. ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ లో నమోదైన కేసుల వివరాలను సిట్ పరిశీలించింది.
Also Read : మళ్లీ బాలయ్యకు టికెట్
డేటా చోరీ కేసును దర్యాప్తు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిట్ ను మార్చి 6 బుధవారం ఏర్పాటు చేసింది. వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నారాయణపేట ఎస్‌డీపీవో శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు, సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు రమేశ్, వెంకట్రామిరెడ్డిని సభ్యులుగా నియమించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు వివరాలను సిట్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఐటీగ్రిడ్స్ సంస్థలోని కంప్యూటర్లు, సర్వర్ల నుంచి వెలికి తీసిన 80 జీబీ డేటా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ఢిల్లీకి వెళ్లింది. ఈ బృందం ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం, ఆధార్ యూఐడీఏఐ కార్యాలయంలోని అధికారులను కలిసి ఐటీగ్రిడ్స్ సంస్థ వద్ద ఉన్న డేటా గురించి ఆరా తీయనుంది.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2