వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ

తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ

Mithun Reddy

Updated On : July 16, 2025 / 9:22 AM IST

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై సిట్‌ లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. ఆయనకు నిన్న హైకోర్టులో షాక్ తగిలిన విషయం తెలిసిందే. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.

కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది. దీంతో సిట్‌ అప్రమత్తమై మిథున్‌రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంది. ఆయనపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. లిక్కర్‌ స్కామ్‌లో మిథున్‌ రెడ్డి పాత్రపై సిట్‌ ఆధారాలు సేకరించింది.

Also Read: హానర్ 400 ప్రో వచ్చేస్తోంది.. నథింగ్ ఫోన్ 3 కంటే బెటర్‌గా ఉంటుందా? కొన్ని రోజులు ఆగి ఎందుకు కొనొచ్చంటే?

లిక్కర్‌ స్కామ్‌లో రాజ్‌ కసిరెడ్డి ఏ1గా, మిథున్‌రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి సహా 11 మందిని సిట్‌ అరెస్టు చేసింది.

ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్‌ మరోసారి విచారణకు పిలిచింది. ఈ కేసులో A39 చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి కూడా ఏసీబీ కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఆయన ముందస్తు, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్ చేసింది.