Building Collapse : కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి

అనంతపురం జిల్లా కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. వారి మృతదేహాలను వెలికి తీశారు.

Building Collapse : కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి

Kadiri

Updated On : November 20, 2021 / 8:04 PM IST

Six killed in building collapse incident : అనంతపురం జిల్లా కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. వారి మృతదేహాలను వెలికి తీశారు. ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలై కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అనంతపురంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కదిరి పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఆ భవనం..పక్కనే ఉన్న మరో రెండు భవనాలపై పడటంతో అవి కూడా ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు.

Swachh Bharat Awards : ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట

ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను తెల్లవారుజామున వెలికి తీయగా మరో ఇద్దరిని సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత మరికొందరి మృతదేహాలను వెలికితీశారు. భవనాలు కుప్పకూలి గాయాలపాలైన వారికి కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. భవనాలు కూలిన సందర్భంలో శిథిలాల కింద కొంతమంది యువకులు చిక్కుకున్నారు.

అయితే ఆ సమయంలో గ్యాస్ లీక్ అయి తీవ్ర గాయాలు కావడంతో నరకయాతన అనుభవించామని బాధితులు అంటున్నారు. తమ దగ్గర ఉన్న ఫోన్ ద్వారా సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేశామని చెప్పారు.