South Central Railway Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 24, 25 తేదీల్లో ఆ ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లు ..
South Central Railway Special Trains : ఆషాఢ ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 24, 25 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
South Central Railway Special Trains
South Central Railway Special Trains : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఆషాఢ ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 24, 25 తేదీల్లో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. జోన్ పరిధిలోని నాగర్సోల్ – పండరీపూర్, పండరీపూర్ – జల్నా, అదిలాబాద్ – మిరాజ్, అకోలా – పండరీపూర్ మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి పండరీపురానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ స్పెషల్ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ 3-టైర్ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
Also Read : AP Govt : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. వినియోగదారులకు ఊరట!
నాగర్సోల్ – పండరీపురం – జల్నా ప్రత్యేక రైళ్లు..
♦ రైలు నెం. 07631 నాగర్సోల్ నుంచి జూలై 24 (శుక్రవారం) సాయంత్రం 7 గంటలకు బయలుదేరి, జూలై 25 (శనివారం) మధ్యాహ్నం 12:50 గంటలకు పండరీపురం చేరుకుంటుంది.
♦ రైలు నెం. 07632 పండరీపురం నుంచి జూలై 25 (శనివారం) రాత్రి 8 గంటలకు బయలుదేరి, జూలై 26 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు జల్నా చేరుతుంది.
♦ ఈ రైళ్లు రోటేగావ్, లాసూర్, ఛత్రపతి సంభాజీనగర్, జల్నా, పర్భణి, పర్లీ వైజ్నాథ్, లాతూర్, ధారాశివ్, కుర్దువాడి, మోడ్నింబ్ తదితర స్టేషన్లలో ఆగుతాయి.
అకోలా – పండరీపురం ప్రత్యేక రైళ్లు..
♦ రైలు నెం. 07635 అకోలా నుంచి జూలై 24 ఉదయం 11 గంటలకు బయలుదేరి, జూలై 25 ఉదయం 9:20 గంటలకు పండరీపురం చేరుతుంది.
♦ రైలు నెం. 07636 పండరీపురం నుంచి జూలై 25 మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, జూలై 26 సాయంత్రం 4:50 గంటలకు అకోలా చేరుతుంది.
♦ ఈ రైళ్లు వాషిం, హింగోలి, బస్మత్, పూర్ణా, పర్భణి, పర్లీ వైజ్నాథ్, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూర్, కలబురగి, సోలాపూర్, కుర్దువాడి, మోడ్నింబ్ తదితర స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఆదిలాబాద్ – మీరజ్ ప్రత్యేక రైళ్లు:
♦ రైలు నెం. 07633 ఆదిలాబాద్ నుంచి జూలై 24 ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:55 గంటలకు మీరజ్ చేరుతుంది.
♦ రైలు నెం. 07634 మీరజ్ నుంచి జూలై 25 రాత్రి 9:30 గంటలకు బయలుదేరి, జూలై 26 మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది.
♦ ఈ రైళ్లు కిన్వాట్, నాందేడ్, పూర్ణా, పర్భణి, పర్లీ వైజ్నాథ్, లాతూర్, పండరీపురం, సంగోలా, జాత్ రోడ్ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి.
మరోవైపు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి – దానాపూర్ – చర్లపల్లి మార్గంలో ఈనెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ గోరఖ్‌పూర్ – హైదరాబాద్ మార్గంలో ఆగస్టు 7 నుంచి 30వ తేదీ వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

