కుక్కకాటు వైద్యానికి స్పెషల్ క్లినిక్‌లు

  • Published By: sreehari ,Published On : November 5, 2020 / 06:55 AM IST
కుక్కకాటు వైద్యానికి స్పెషల్ క్లినిక్‌లు

Updated On : November 5, 2020 / 10:18 AM IST

dog bite treatment  : కుక్కకాటు బాధితులకు ప్రత్యేక వైద్యం అందిచనుంది ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రతి ఏడాది 4 లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారు.  యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ కోసం మరో చోటుకు వెళ్లి వేయించుకోవాల్సి వస్తోంది.



ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక డాక్టర్‌తో పాటు ఒక స్టాఫ్‌నర్సు ఉంటారు. అన్ని జిల్లాల వైద్యాధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు ఇతర జంతువుల కాట్లకు వైద్యం అందించనున్నారు.



ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లినిక్‌లు పనిచేస్తాయి. యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌తో పాటు పాము కాటు మందు కూడా లభిస్తుంది.