Janasena: ఉత్తరాంధ్రపై పవన్ ఫోకస్.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Janasena
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రలో సంస్థాగత నిర్మాణంపై అక్కడి త్రిసభ్య కమిటీ వేసిన జనసేన.. మున్సిపల్, పరిషత్, పంచాయితీ ఎన్నికల్లో జనసేన, అధికార వైసీపీకి ఈ ప్రాంతంలో గట్టి పోటీ ఇవ్వడంతో రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఫోకస్ పెట్టేందుకు పక్కా వ్యూహంతో వెళ్తుంది జనసేన.
పంతం నానాజీ, ముత్తా శశిధర్, అర్హన్ ఖాన్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది జనసేన.. తొలుత మండల, గ్రామ కమిటీల నిర్మాణం పూర్తయ్యే విధంగా కమిటీ చర్యలు చేపడుతోంది. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు త్రిసభ్య కమిటీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, రెండేళ్లు మాత్రమే ఎన్నికలకు ఉన్న నేపధ్యంలో పరిస్థితులను చూసుకుని పార్టీని బలోపేతం చెయ్యాలని జనసేన భావిస్తోంది.