Srivari Brahmotsavam: చిన్నశేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి… వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. బుధవారం బుధవారం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్న శేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు.

Srivari Brahmotsavam: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్న శేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు.
CM Jagan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం జగన్.. పరకామణి భవనం ప్రారంభం
ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు స్వామి వారు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో వివిధ కళా బృందాలు ఇచ్చిన ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పురాణాల ప్రకారం చిన్న శేషుడిని వాసుకి (నాగ లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి.. ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి
బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ధర్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.