కరోనాను అరికట్టాలంటే..ఇదొక్కటే మార్గం

కరోనా మహమ్మారీని కట్టడి చేయాలంటే…స్వీయ నిర్భందమే మేలని చాలా మంది వెల్లడిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కరోనా బాధితులను గుర్తించడం మరింత సులువవుతుందని అంటున్నారు. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని..బయటకు రావొద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణాలో మార్చి 31 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని అంటున్నారు నిపుణులు.
కరోనా వైరస్ సోకిన వారిని వెంటనే గుర్తించి..క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తుంటారు. నెగటివ్ రిపోర్టు వచ్చిన అనంతరం ఇంటికి పంపిస్తారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఎవరితో కాంటాక్ట్ అయ్యాడు ? ఎవరితో తిరిగాడు ? తదితర సమాచారాన్ని అతనే వెల్లడిస్తాడు. కానీ..వారి సమూహంలో ఎంత మంది ఉన్నారు ? వీరు తాకిన (వైరస్ సోకిన వ్యక్తి) వస్తువులను ఎవరైనా వాడారా ? వారి తుంపర్ల ద్వారా ఎవరికైనా సోకిందా ? అనేది గుర్తించడం చాలా కష్టం.
కానీ వీరు ఇళ్లు దాటకుండా 21 రోజులు నివాసంలోనే ఉంటే..కరోనా వైరస్ బయటకు రాదని అంటున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి 14 రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతాయి. వీరి ద్వారా ఎవరెవరికి సోకిందనేది ఖచ్చితంగా గుర్తించవచ్చు. వీరిని ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉంచడం లేదా..క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తే ఇతరులకు వైరస్ సోకడాన్ని అరికట్టవచ్చంటున్నారు.
ఇలా చేయబట్టే చాలా దేశాలు వైరస్ ని కంట్రోల్ చేశాయి. ప్రధానంగా చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. కానీ..చైనా తీవ్రమైన ఆంక్షలు విధించింది. నగర ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దీంతో వైరస్ బారిన పడకుండా ఇతరులను కాపాడగలిగింది. ఇక ఈ వ్యాధి సోకిన వారిని నిర్వంధంలో ఉంచారు. ఎలాంటి లక్షణాలు లేకపోతే..ఇంటికి పంపించే ఏర్పాట్లు చేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే ఫాలో అవుతున్నాయి.