Strange tree : ఈ చెట్టుకు ఆకుల కంటే కాయలే ఎక్కువ

వాటర్ ఆపిల్ ఆకుల కంటే కాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేల కాయలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Strange tree : ఈ చెట్టుకు ఆకుల కంటే కాయలే ఎక్కువ

Strange Tree More Nuts Than Leaves

Updated On : April 3, 2021 / 11:37 AM IST

Strange tree : వాటర్ ఆపిల్ ఆకుల కంటే కాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేల కాయలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తాడేపల్లికి చెందిన రైతు పరుచూరి సుభాష్‌చంద్రబోస్‌-వసుమతి దంపతులు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి వాటర్‌ ఆపిల్‌ మొక్కను తీసుకొచ్చి దశాబ్ద కిందట తమ పెరట్లో నాటారు. అది గత నాలుగేళ్లుగా ఫలాలనిస్తోంది.

ఈ ఏడాది శీతాకాలంలో పూత వచ్చి ప్రస్తుతం కొమ్మ కొమ్మకు కాయలు గుత్తులు, గుత్తులుగా కాశాయి. 8 మీటర్లకు పైగా ఎత్తు పెరిగిన ఈ చెట్టు దాదాపు అర టన్ను దిగుబడి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మార్కెట్‌లో ఈ పండ్లకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఉచితంగా పంపిణీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఈ ఫలం ఎంతో ఉపయోగకరమన్నారు.

సీ విటమిన్‌తో పాటు ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయన్నారు. వాటర్‌ ఆపిల్‌ చెట్టు సహజంగా వందల సంఖ్యలో కాయలు కాస్తుందని, భూమిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నప్పుడు అరుదుగా ఇలా వేల సంఖ్యలో కాయలు కాస్తాయని ఘంటసాల కృషీ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వి.ప్రసూన తెలిపారు.