Student Coma : పలమనేరు స్కూల్లో ఘోరం.. టీచర్ కొట్టడంతో కోమాలో విద్యార్థి
ఓ టీచర్.. విద్యార్థిపై ప్రతాపం చూపించాడు. గొడ్డుని బాదినట్టు బాదాడు. దీంతో ఆ బాలుడు కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Student Coma
Student Coma : చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మాసిస్ మిషనరీ స్కూల్ లో ఘోరం జరిగింది. ఓ టీచర్.. విద్యార్థిపై ప్రతాపం చూపించాడు. గొడ్డుని బాదినట్టు బాదాడు. దీంతో ఆ బాలుడు కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
13 Girls Raped : 13 మంది విద్యార్ధినులపై ఉపాధ్యాయుడు అత్యాచారం..జీవిత ఖైదు విధించిన కోర్టు
బాలుడి పేరు రోహిత్. 8వ తరగతి చదువుతున్నాడు. జ్వరంతో బాధపడుతూ స్కూల్ కి వెళ్లాడు. కాగా, లెక్కల మాస్టర్ జ్యోతీశ్వర్ రోహిత్ పై చేయి చేసుకున్నాడు. రోహిత్ తలను బల్లకేసి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు రోజులకు రోహిత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మాటలు రాక ఇబ్బందులు పడ్డాడు.
రోహిత్ పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రోహిత్ ని తిరుపతికి తీసుకెళ్లారు. స్విమ్స్ ఆసుపత్రిలో రోహిత్ కు చిక్సిత్స అందిస్తున్నారు. కాగా, రోహిత్ ను కొట్టిన టీచర్ ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారుల విచారణ చేపట్టారు.
Three Marriages : చిత్తూరులో నిత్యపెళ్లి కొడుకు.. గుట్టురట్టు చేసిన మూడో భార్య
టీచర్ కొట్టడంతో బాలుడు కోమాలోకి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్కూల్ లోని సహచర విద్యార్థులు, ఇతరులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.