Chandrababu Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ విచారణపై ఉత్కంఠ.. ధర్మాసనం ఏం తీర్పు ఇవ్వనుంది?

హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టి వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్టు చెల్లదని చంద్రబాబు అంటున్నారు.

Chandrababu Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ విచారణపై ఉత్కంఠ.. ధర్మాసనం ఏం తీర్పు ఇవ్వనుంది?

Chandrababu Petition Supreme Court

Updated On : September 26, 2023 / 9:52 AM IST

Chandrababu Petition – Supreme Court : సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇవాళ చంద్రబాబు తరపు లాయరు సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేయనున్నారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు లూథ్రా ప్రస్తావించనున్నారు.

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2కు వరకు సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో చంద్రబాబు పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరుతున్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టి వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్టు చెల్లదని చంద్రబాబు అంటున్నారు.

Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామాలు.. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కే. అజయ్ రెడ్డిని చేర్చారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టాలని, ఎఫ్ఐఆర్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. నిన్న (సోమవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్ ను సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తావించగా మంగళవారం మెన్షన్ చేయాలని సీజేఐ ఆదేశించారు.