TDP Members Suspension : ఏపీ శాసనమండలి నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సారా మరణాలు సహజం కావని, అవి ప్రభుత్వ హత్యలేనని మండలిలో నినాదాలు చేశారు. మద్యపాన నిషేదంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tdp Suspension
AP Legislative Council : ఏపీ శాసనమండలి నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు. ఏపీలో సారా మరణాలు, జే మద్యాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ పోడియంను చుట్టు ముట్టారు. సారా మరణాలు సహజం కావని, అవి ప్రభుత్వ హత్యలేనని మండలిలో నినాదాలు చేశారు. మద్యపాన నిషేదంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ మోసెస్ రాజు సస్పెండ్ చేశారు.
సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్న దృష్ట్యా ఎమ్మెల్సీలు రామ్మోహన్, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, ప్రభాకర్ ను ఒకరోజు సస్పెండ్ చేయాలని మంత్రి అప్పలరాజు మండలి చైర్మన్‌ను కోరారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
AP 2nd official language urdu : రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూ..బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..
మంత్రి కన్నబాబు ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. మండలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోసారి మండలిలో టీడీపీ సభ్యులు చిడత వాయించారు. సభ నుంచి బయటకు వెళ్లకుండా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే సభ్యుల ప్రవర్తనపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. సస్పెండ్ అయిన సభ్యులను బయటకు పంపాలని చైర్మన్ ఆదేశించారు. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.