AP 2nd official language urdu : రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూ..బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..

రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం పలికింది. బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

AP 2nd official language urdu : రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూ..బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..

Ap Assembly Urdu  Official Language Bill Approved

ap assembly urdu  official language bill approved : ఏపీ రాష్ట్ర ద్వితీయ భాషగా ఉర్ధూ ఉండాలని సీఎం జగన్ కేబినెట్ ఆమోదం పలికిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈక్రమంలో ఈ కీలక బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టటం దానికి ఆమోదం పలకటం కూడా  జరిగింది.  ఏపీ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈరోజు మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. అదే ఉర్ధూభాష బిల్లు. రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూను ప్రతిపాదిస్తూ బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉర్దూను అధికార భాషగా గుర్తించేలా చేసిన సీఎం జగన్‌కు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు పలు అంశాలపై ఏపీ అసెంబ్లీ తీవ్ర గందరగోళాల మధ్య కొనసాగుతోంది. కల్తీసారా..లిక్క నియంత్రణ వంటి విషయాలపై ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తోంది. మరోపక్క ఏపీ ప్రభుత్వం టీడీపీ కౌంటరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో లిక్కర్ ఏరులై ప్రవహించలేదా? అని ప్రశ్నిస్తోంది. మరోవైపు ఏపీలో కల్తీసారా మరణాల అంశంలో శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సారా మరణాలు సహజ మరణాలు కాదని.. అవి ప్రభుత్వ మరణాలు అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేపట్టారు. మద్యం నిషేధం చేస్తామని అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మద్యాన్నిఏరులై ప్రవహించజేస్తోందని..అధిక ధరలకు అమ్ముతోందని వాటిని కొనలేక పేదవారు కల్తీ సారాలు తాగి ప్రాణాలు కోల్పోతున్నారని..అయినా ప్రభుత్వం పట్టించుకోవటంలేదంటూ టీడీపీ విమర్శలు చేస్తు ఈ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు మండలి ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు రామ్మోహన్‌, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డిలను ఒకరోజు సస్పెన్షన్‌ చేయాలని మంత్రి అప్పలరాజు మండలి మండలి ఛైర్మన్‌ను కోరారు. దీంతో ఎమ్మెల్సీలపై ఒక రోజు సస్పెన్షన్‌ విధిస్తున్నట్టు మోషేన్ రాజు ప్రకటించారు.