Tadipatri : తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.. భారీ బదోబస్తు
Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకిదిగి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
High tension in Tadipatri once again Kethireddy Pedda Reddy house arrest
Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ గాంధీకూడలిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఇప్పుడు దీక్ష చేయడం ఏమిటని ప్రశ్నిస్తే టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీక్షచేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Also Read : Gade Sai Krishna Case : సాయికృష్ణ కేసులో సంచలన మలుపు.. హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై సిట్ ఆరా..
కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపు మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తాడిపత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో కేతిరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటివద్దే నాయకులు, కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. దీంతో పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసు ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో పెద్దారెడ్డిని వాహనంలో తీసుకెళ్లకుండా సిమెంట్ బెంచీలు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతున్న సమయంలో పోలీసులు లాఠీఛార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన నివాసంలోనే గృహనిర్భందం చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, పెద్దారెడ్డి తన ఇంటి వద్దే దీక్ష చేపట్టారు.
మరోవైపు తాడిపత్రి పట్టణంలో ఘర్షణలు చోటుచేసుకోకుండా పట్టణంలోని కీలక పాత్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.
