Andhra pradesh : తాడిపత్రి సీఐ ఆత్మహత్య .. రాజకీయ ఒత్తిడే కారణమంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీ సీఐ ఆనందరావు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Andhra pradesh : తాడిపత్రి సీఐ ఆత్మహత్య .. రాజకీయ ఒత్తిడే కారణమంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

Tadipatri CI Ananda Rao

Updated On : July 3, 2023 / 10:42 AM IST

Tadipatri CI Ananda Rao : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఆనందరావు ఆత్మహత్యపై స్పందించిన ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ కలహాలే కారణమని తెలిపారు. కానీ సీఐ కుటుంబ సభ్యులు మాత్రం పని ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని చెబుతోంది. ఇలా కుటుంబ సభ్యులు చెప్పే కారణాలకు, పోలీసులు చెప్పే కారణాలకు ఎక్కడా పొంతన కుదరటంలేదు. ఆనందరావు గతంలో తిరుపతి, కడపలో పనిచేశారు. అయినా ఎక్కడా ఒత్తిడికి గురికాలేదని చెప్పారు. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తన వల్ల కావడం లేదని చెప్పుకుని పలుమార్లు తన వద్ద బాధపడేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే ఒత్తిడితోనే సీఐ ఆత్మహత్య : జేసీ 
సీఐ కుటుంబ సభ్యుల చెప్పినట్లుగానే జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా రాజకీయ ఒత్తిడులే ఆత్మహత్యకు కారణమంటున్నారు. అక్రమ కేసులు పెట్టాలని  ఎమ్మెల్యే పెద్దారెడ్డి సీఐ ఆనందరావుపై ఒత్తిడులు తెచ్చారని ఆరోపించరు. అందుకే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సీఐ ఇటీవల ఎవరెవరిని కలిసారో విచారనణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్యను రాజకీయం చేయొద్దు : ఎమ్మెల్యే పెద్దారెడ్డి
సీఐ ఆత్మహత్యకు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయ చేయటం సరికాదన్నారు.

ఇలా పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో సీఐ ఆనందరావు ఆత్మహత్యకు కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.