పుంగనూరులో మున్సిపల్ ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన టీడీపీ

పుంగనూరులో మున్సిపల్ ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన టీడీపీ

Updated On : March 2, 2021 / 7:59 PM IST

TDP boycotts Municipal elections : పుంగనూరులో మున్సిపల్ ఎన్నికలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు.. పుంగనూరులో ఎలక్షన్ హాలిడే ప్రకటిస్తున్నామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

33 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ తిరిగి నిర్వహించాలని ఎస్‌ఈసీని కోరితే.. కేవలం మూడు వార్డుల్లో రీ నామినేషన్లకు అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులను వైసీపీ నాయకులు తీవ్రంగా భయబ్రాంతులకు గురిచేశారని శ్రీనాథ్‌రెడ్డి ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.