ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు: కేశినేని చిన్ని

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఆ పార్టీకి నాయకులకు కూడా అర్థమయిందని అందుకే వేరే దారులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు: కేశినేని చిన్ని

kesineni chinni

Updated On : February 1, 2024 / 1:18 PM IST

Kesineni Chinni: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని, పులివెందులలో వైఎస్ జగన్ ఓడిపోబోతున్నారని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జనసేన కూటమి 165 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. వైసీపీ ఓడిపోతుందని ఆ పార్టీకి నాయకులకు కూడా అర్థమయిందని అందుకే వేరే దారులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు తెలుగు దేశం పక్షాన ఉన్నారని, ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన అభ్యర్థులను గెలిపించబోతున్నారని అన్నారు.

ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని.. ఒకే జాతి పక్షులన్నీ ఒకే గూటికి చేరాయని అందుకే ఇష్టమొచ్చినట్టు వ్యవహిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నానికి విశ్వాసం అనేది లేదని.. సైకోలు అన్ని ఒకే చోటకు చేరాయన్నారు. నాని మూడు లక్షల ఓట్లతో ఓడిపోబోతున్నారని, కేశినేని నాని ఇక ప్రజా జీవితంలో మిగలరని వ్యాఖ్యానించారు. దేవినేని అవినాశ్‌కి కేశినేని నాని ముఖ్య అనుచరుడుగా మారారని ఎద్దేవా చేశారు. కేశినేని నానికి అసలు వైసీపీలో టికెట్ వస్తుందో రాదో కూడా తెలియదన్నారు.

Also Read: ఉత్తరాంధ్రలో ఈసారి ఎగిరే జెండా ఏది? ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?

టీడీపీ, జనసేన అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని కేశినేని చిన్ని చెప్పారు. ఉమ్మడి మ్యానిఫెస్టోను కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించినా కలిసికట్టుగా ఉండి ఏడు నియోజకవర్గాల్లో విజయానికి కృషి చేస్తామన్నారు.