Nara Lokesh Comments YCP : టీడీపీ కార్యాలయంపై దాడి చేసినవారిని కట్ డ్రాయిర్ పై ఊరేగిస్తాను : నారా లోకేశ్
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేశారు. పాపానాయుడుపేటలో మీసం తిప్పి, చిటికేసి పౌరుషంగా నారా లోకేశ్ మాట్లాడారు. తాను పాదయాత్ర చేస్తుంటే తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.

Lokesh
Nara Lokesh Comments YCP : వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని కట్ డ్రాయిర్ పై ఊరేగిస్తానని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు ఒక చిటికేసి చెబితే చాలు టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ల పని పడతారని చెప్పారు. తమకు పౌరుషం లేదనుకోవద్దు.. రండి చూసుకుందాం అని సవాల్ చేశారు. పోనీలెమ్మని ఓర్పు, సహనంతో ఉంటున్నాం.. మా ఓర్పు, సహనాన్ని పరీక్షించకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బుధవారం టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేశారు. పాపానాయుడుపేటలో మీసం తిప్పి, చిటికేసి పౌరుషంగా నారా లోకేశ్ మాట్లాడారు. తాను పాదయాత్ర చేస్తుంటే తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. డిఎస్పీ డిస్ట్రబ్ చేశారని పేర్కొన్నారు. ప్రసంగాన్ని అడ్డుకోవడం పద్ధతి కాదన్నారు. వైసీపీ కార్యకర్తలు కత్తులు, రాళ్లతో తనపై దాడులకు సిద్ధంగా వున్నా నో కేస్.. తాను మాత్రం స్కూల్ ఎక్కి మాట్లాడితే కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.
TDP Lokesh Padayatra : ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా? నారా లోకేశ్
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేస్తే కేసు లేదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తన వద్దకు రండి.. ఇక్కడే నిలబడతాను అని సవాల్ విసిరారు. రేపొచ్చేది తమ ప్రభుత్వమేనని.. పోస్టింగులు ఇచ్చేది తానేనని అని గుర్తు పెట్టుకోవాలన్నారు. తన గొంతు ఆగదని స్పష్టం చేశారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్ టీ రామారావు తనకు ఈ ధైర్యాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. తన ఒంట్లో శక్తి ఉన్నంతవరకు ప్రజల తరపున పోరాడుతూనే ఉంటానని చెప్పారు.