బాబు పర్యటనకు ముందే పల్లా దీక్ష భగ్నం

బాబు పర్యటనకు ముందే పల్లా దీక్ష భగ్నం

Updated On : February 16, 2021 / 10:10 AM IST

TDP Leader Palla Srinivas Protest Bust:విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి ఆసుపత్రికి బలవంతంగా తరలించారు.

అర్థరాత్రి నుంచి శిబిరం వద్ద మోహరించిన పోలీసులు.. తెల్లవారుజామున పల్లా శ్రీనివాస్‌ దీక్షను భగ్నం చేశారు. పల్లాను బలవంతంగా అదుపులోకి తీసుకుని.. షీలానగర్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

పల్లా శ్రీనివాస్‌ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు విశాఖ పర్యటన తలపెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే చంద్రబాబు రాకముందే పల్లా శ్రీనివాస్‌ దీక్షను భగ్నం చేయడంతో స్థానికంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అంతుకుముందు నారా లోకేష్ పల్లా శ్రీనివాస్ దీక్షకు మద్దతు ప్రకటించారు. ఆరురోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు పర్యటన ఉండగా.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన పల్లా శ్రీనివాస రావు దీక్ష చేపట్టారు.