Andhra Pradesh : గుడివాడ గుట్కా నాని, పిల్లసైకో వల్లభనేని వంశీ ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది : టీడీపీ నేత ఘాటు వార్నింగ్
కొడాలి నానిని గుడివాడ గుట్కా నాని అనీ..వల్లభనేని వంశీని పిల్లసైకో అంటూ సంభోధిస్తు TDP నేత పట్టాభిరామ్ కౌంటర్ ఇచ్చారు. గుడివాడ గుట్కా నాని, పిల్లసైకో వల్లభనేని వంశీ ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చారు. గుట్కాతోపాటు ఈమధ్య గంజాయికికూడా అలవాటుపడ్డ కొడాలినాని ముందు తాడేపల్లి సైకో అంటే సీఎం జగన్ D.N.A ఏంటో తెలుసుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు పట్టాభిరామ్.

Pattabhiram gives strong warning to YCP leaders Kodali Nani and Vallabhaneni Vamsi
Andhra Pradesh : సీఎం జగన్ మోహన్ రెడ్డి DNA గురించి ప్రశ్నించేటప్పుడు నీ DNA ఏంటో ముందు తెలుసుకో అంటూ టీడీపీ నేత నారా లోకేశ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కౌంటర్ ఇచ్చారు. కొడాలి నానిని గుడివాడ గుట్కా నాని అనీ..వల్లభనేని వంశీని పిల్లసైకో అంటూ సంభోధిస్తు కౌంట్ ఇచ్చారు. గుడివాడ గుట్కా నాని, పిల్లసైకో వల్లభనేని వంశీ ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చారు. గుట్కాతోపాటు ఈమధ్య గంజాయికి కూడా అలవాటుపడ్డ కొడాలినాని ముందు తాడేపల్లి సైకో DNA ఏంటో తెలుసుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు పట్టాభిరామ్.
మీ సైకో DNA చంచల్ గూడ జైలు అయితే, లోకేశ్ D.N.A ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ అని ముందు తెలుసుకో అంటూ సెటైర్ వేశారు. లోకేశ్ దృష్టిలో DNA అంటే (Devolopment Of Navya Andhra). కట్టడం, నిర్మించడం, అభివృద్ధిచేయడం అదీ లోకేశ్ డీ.ఎన్.ఏ ఇటువంటి పదాలకు అర్థం కూడా తెలియని మీలాంటి సైకోలకు ఏం చెప్పినా అర్థం కాదన్నారు.జగన్ దృష్టిలో DNA అంటే (Destruction Of Navya Andhra). కూల్చడం, నాశనం చేయడమేనంటూ విమర్శించారు. జగన్ ప్రజల సొమ్ములు మింగింది సరిపోక..భార్య భారతిగారిని షెల్ కంపెనీల్లో డైరెక్టర్నిచేసి, ఆమెను కూడా ఈడీ, సీబీఐ కేసుల్లోకి లాగాడని అదీ తాడేపల్లి సైకో లక్షణాలు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Also Read: నీ DNA ఏంటో ముందు తెలుసుకో-చంద్రబాబు, లోకేశ్‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
పిల్లసైకో వంశీ.. నువ్వు చంద్రబాబు, లోకేశ్ ల బొమ్మతో గెలిచి వారికే ఛాలెంజ్ విసురుతావా?అంటూ వల్లభనేని వంశీపై మండిపడ్డారు.చంద్రబాబు, లోకేశ్ లు ఆదేశిస్తే గన్నవరంలో నీపై పోటీచేయడానికి నేను రెడీగా ఉన్నా నువ్వు రెడీయా అంటూ సవాల్ విసిరారు.నీకు డిపాజిట్లు రాకుండాచేసి, నిన్ను గన్నవరం నుంచి ప్రజలు తరిమికొట్టేలా చేస్తానంటూ మండిపడ్డారు.నువ్వూ… నీ 420బ్రదర్ నాని కలిసి గన్నవరంలో ఎన్నిస్కామ్ లు చేసి, ఎంతప్రజలసొమ్ము దిగమింగారో అందరికీ తెలుసు.ఈ విషయాన్ని ప్రజల ముందు నిరూపించి వారితోనే నిన్ను తరిమికొట్టేలా చేస్తానంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు పట్టాభిరామ్.