విజయవాడ తెలుగు తమ్ముళ్ల ఫైట్, ఎంపీ కేశినేని నానిపై ఫైర్ అవుతున్న నేతలు

ap tdp
MP Kesineni Nani : ‘ఎంపీ కేశినేని నాని..ఎక్కడ హీరోవో తేల్చుకుందాం…అతనిది ఒంటెద్దు పోకడ..టీడీపీని కుల సంఘంగా మార్చాలని అనుకుంటున్నారా ? తాము వైసీపీ ఎంపీ సాయిరెడ్డితో పోట్లాడుతుంటే..ఆయన్ను లంచ్ కు పిలుస్తారా ? కేశినేని స్థాయి ఏంటీ ? బాబును ఎదిరించినప్పుడే కేశినేనిని చెప్పుతో కొట్టాల్సింది. 2024లో తాను విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తాను’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ టీడీపీలో నేతల మధ్య విబేధాలు బయటపడడం ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
అధినేత చంద్రబాబు బెజవాడకు వస్తున్న నేపథ్యంలో..ఎంపీ కేశినేని నాని వ్యవహరిస్తున్న తీరును తెలుగు తమ్ముళ్లు అగ్గీలంమీద గుగ్గిలమవుతున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలు తీవ్రస్థాయిలో ఫైర్ కావడం గమనార్హం. మేయర్ ఎంపికలోనూ..చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సదరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేశినేని నానిది ఒంటెద్దు పోకడ అంటూ..బోండా ఉమ మండిపడ్డారు. విజయవాడ నగరానికి వంగవీటి మోహన రంగ, దేవినేని నెహ్రూ ఏదో చేశారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఆఫీసులో కూర్చొని..పెద్ద హీరోగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు రూట్ మ్యాప్ చెప్పకపోవడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ప్రజల ఆరాధ్యదైవం, ఓడినా చంద్రబాబు లెజెండ్ అన్నారు. బాబు ఓర్పుతో ఉండాని ఆనాడు చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు.
అతని ఒంటెత్తుపోకడలు అన్ని వర్గాల వారినీ మనస్థాపానికి గురి చేస్తున్నాయని టీడీపీ నేత బోండా ఉమ వెల్లడించారు. అధిష్టానానికి వ్యతిరేకంగా అతను మాట్లాడుతున్నారని, పార్టీని నమ్ముకుని తాము పనిచేస్తుంటే..పదవుల కోసం ఎంపీ కేశినేని పని చేస్తున్నారని దుయ్యబట్టారు.