Pawan Kalyan : ఏపీ కోసం పవన్ ప్రకటన హర్షణీయం .. వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి : మాజీ మంత్రి
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొత్తులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తులపైనే హాట్ టాపిక్ కొనసాగుతోంది. ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే మూడుసార్లు భేటీ అయినా పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వలేదు. వైపీపీ దాష్టికాలను అంతం చేయటానికి ఇరుపార్టీలు సిద్దంగా ఉన్నా పొత్తులపై క్లారిటీ ఇవ్వకపోయినా పొత్తులు మాత్రం ఖరారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను సంచలనం కలిగిస్తున్నాయి..

Janasena Pawan Kalyan
Andhra Pradesh : ఏపీలో ఎన్నికల పొత్తుల గురించి తీవ్ర ఆసక్తి నెలకొన్న తరుణంలో తూర్పుగోదావరి పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలో ఏపీలో తీవ్ర సంచలనం కలిగించారు. పవన్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు ఆహ్వాన్నిస్తున్నారు. దీంట్లో భాగంగా మాజీ మంత్రి.టీడీపీ నేతల ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతు..ఆంధ్రప్రదేశ్ లో ప్రయోజనాల గురించి పవన్ కల్యాణ్ చేసిన హర్షణీయం అని అన్నారు. పవన్ వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని..పవన్ వ్యాఖ్యలను ప్రతీ ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. బీజేపీని కూటమిలోనికి తీసుకురావటానికి పవన్ యత్నిస్తున్నారని దాంట్లో సఫలం అవుతారనే ధీమా ఆయన మాటల్లో ఉందని దీంతో వైసీపీ నేతలకు వణుకుపుట్టుకొస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ చేసిన వ్యాఖ్యలతో మేం ఏకీభవిస్తున్నామని పవన్ తో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు పుల్లారావు.
Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
కాగా ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొత్తులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తులపైనే హాట్ టాపిక్ కొనసాగుతోంది. ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే మూడుసార్లు భేటీ అయినా పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వలేదు. వైపీపీ దాష్టికాలను అంతం చేయటానికి ఇరుపార్టీలు సిద్దంగా ఉన్న తరుణంలో ఇరుపార్టీల నేతలు పొత్తులపై క్లారిటీ ఇవ్వకపోయినా పొత్తులు మాత్రం ఖరారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను సంచలనం కలిగిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం గమనించాలి. అదేమిటంటే టీడీపీ, జనసేన కలిసినా..బీజేపీని కూడా కూటమిలో కలుపుకుంటే మరింత బలం పెరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీకి అనుంగుడుగా..వ్యవహరిస్తున్న జగన్ తో బీజేపీ కలవకుండా చూడటం అత్యంత ముఖ్యంగా ఉంది. దీంతో ఆ విషయాన్ని గుర్తించిన పవన్ ఎట్టిపరిస్థితుల్లోనే బీజేపీ, వైసీపీ కలవకుండా ఉండేందుకు మరోపక్క తన పార్టీ బీజేపీ గులామ్ పార్టీయే అని విమర్శలు వస్తున్నా..పవన్ మాత్రం బీజేపీతో చెలిమి చేస్తునే మరోపక్క ఏపీ ప్రయోజనాల కోసం తీవ్రంగా యత్నిస్తున్నారనేలా పవన్ వ్యవహార శైలి ఉంది. ఈక్రమంలో ఎన్ని ఘాటు విమర్శలు వచ్చినా చేయల్సింది మాత్రం చేసుకుంటుపోతున్నాను అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు పవన్
Pawan Kalyan : పవన్ మాటలు ప్రజల్లో భరోసా నింపాయి, జగన్‌ని ఓడించాలంటే ఏకం కావాల్సిందే- టీడీపీ నేతలు
పదవులు ముఖ్యంగా కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగానే మొదటినుంచి పవన్ కట్టుబడి ఉన్నారు.తాజాగా ఆయన అదే విషయాన్ని నొక్కి చెప్పారు. పొత్తులతోనే ముందుకెళతాం..ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్ చేయనని.. ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయ పడకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీఎం పదవి అనేది వరించి రావాలి తప్ప, కోరుకుంటే వచ్చేది కాదన్నారు. మన కష్టం మీదే ముఖ్యమంత్రి పదవి మనల్ని వరించాలి తప్ప మనం ఆ పదవి కోసం పాకులాడకూడదన్నారు. పొత్తుల్లో సీఎం అభ్యర్థి కండీషన్ ఉండదని, రాష్ట్ర భవిష్యత్తు కండీషన్ మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. కండీషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి పొందలేమన్నారు. తన పార్టీ బలం ఏంటో తనకు తెలుసని..అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటకే కట్టుబడి ఉన్న పవన్ అదే దిశగా పనిచేస్తున్నారు. దీంట్లో భాగంగానే బీజేపీని కూటమిలో కలిపే యత్నం చేస్తున్నారనేలా ఉన్నాయి నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలు. బీజేపీని ఒప్పిస్తానని ధీమా వ్యక్తంచేశారు. ఈక్రమంలో పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని పవన్ పదే పదే చెప్పే మాటకే కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.