Paritala Sunitha: పరిటాల రవి హత్య కేసుపై మాజీ మంత్రి సునీత సంచలన వ్యాఖ్యలు.. జగన్ ప్రమేయం కూడా ..
పరిటాల రవి హత్య కేసుపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Parita Sunitha
Paritala Sunitha: పరిటాల రవి హత్య కేసుపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్త పరిటాల రవి హత్యలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉందని ఆరోపించారు. ఆరోజు సీబీఐ జగన్ ను కూడా విచారించిందని తెలిపారు. టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలి అంటూ సునీత అన్నారు.
Also Read: Vangaveeti Radha : వంగవీటి రాధాకు కీలక పదవి..! కాపులకు సీఎం చంద్రబాబు పెద్దపీట..
పరిటాల సునీతా గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తోపుదుర్తి సోదరులు తమ స్వార్థంకోసం ఫ్యాక్షన్ ను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబుల్ రెడ్డి, మద్దెల చెరువు సూరి కుటుంబాలను ఇందులోకి లాగుతున్నారు. గంగుల భానుమతి, కనుముక్కల ఉమాకు ఇదే నా విజ్ఞప్తి.. ఫ్యాక్షన్ కారణంగా మన మూడు కుటుంబాలు నష్టపోయాయి. మన కుటుంబాలు దీని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. ప్రశ్రాంతంగా ఉన్న సమయంలో తోపుదుర్తి సోదరులు మళ్లీ ఇందులోకి మిమ్మల్ని లాగుతున్నారు. వారి మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావద్దని సునీత సూచించారు.
Also Read: Inter Results: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. పేపర్ దిద్దే విషయంలో కొత్త నిర్ణయం
ఫ్యాక్షన్ ను రెచ్చగొట్టి చలి కాచుకోవాలని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చూస్తున్నారు. పాపంపేటలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇళ్లు కూల్చివేశారు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత బాధితులను రెచ్చగొడుతున్నారు. మా కుటుంబం ఇచ్చే కుటుంబం కానీ తీసుకునే కుటుంబం కాదు. ఎంపీపీ ఎన్నికల విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. అలాచేసుకొని ఉంటే కచ్చితంగా రామగిరి ఎంపీపీ టీడీపీ వశం అయ్యేదని సునీత అన్నారు. వారి ఎంపీటీసీల మీద నమ్మకం లేకనే క్యాంపులకు తరలించారు.
తోపుదుర్తి చందు చంద్రబాబు, లోకేశ్ లపై ఎలా మాట్లాడారో అంతా చూశారు. ఇప్పుడు కేసుల భయంతో గారు అని సంభోదిస్తున్నారు. తోపుదుర్తి సోదరులు ఏది చెబితే అదే జగన్ మాట్లాడుతున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు వాస్తవాలు తెలుసుకోరా అంటూ జగన్ ను సునీత ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం కలిసొచ్చినట్లుంది.. అందుకే శుక్రవారం రోజు పాపిరెడ్డిపల్లికి వస్తానంటున్నారు అంటూ సునీత ఎద్దేవా చేశారు.
జగన్ తన సూట్ కేసులో కొన్ని బట్టలు ఎక్కువగా తీసుకొని రావాలి.. ఇక్కడ లింగమయ్యతోపాటు మీ పార్టీ బాధితులను కూడా పరామర్శించాలి. తోపుదుర్తి బ్రదర్స్ వల్ల ఐదేళ్లలో మీ పార్టీ వారు చాలా మంది నష్టపోయారు. వారిని కూడా జగన్ పరామర్శిస్తే బాగుంటుంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో జగన్ వచ్చి ఫ్యాక్షన్ ను రగిలించొద్దని సూచిస్తున్నానంటూ సునీత కోరారు.