Inter Results: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. పేపర్ దిద్దే విషయంలో కొత్త నిర్ణయం

రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

Inter Results: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. పేపర్ దిద్దే విషయంలో కొత్త నిర్ణయం

Telangana intermediate students

Updated On : April 3, 2025 / 9:47 AM IST

Inter Results: తెలంగాణలో మార్చి 25న ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు పూర్తయిన నాటినుంచి ఇంటర్‌లోని అన్ని సబ్జెక్టుల పత్రాల మూల్యాంకనం ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు.

Also Read: Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు వచ్చేది అప్పుడే.!

రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారంరోజుల పాటు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డులో పనిచేసే ఉప కార్యదర్శులను ఆయా మూల్యాంకన కేంద్రాలకు వెళ్లి ఇప్పటికే మూల్యాంకనం పూర్తయిన జవాబు పత్రాలను పరిశీలించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశించినట్లు తెలిసింది. పరీక్షలో విద్యార్థులు పది లోపు మార్కులు, 30 నుంచి 35లోపు మార్కులు, 90కిపైగా మార్కులు సాధించిన జవాబు పత్రాలను వారు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Trump Tariffs: ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్.. బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా..

విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే అధ్యాపకులు జవాబుదారీ తనంతో వ్యవవహరించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మూల్యాంకన కేంద్రాలకు అధికారులను పంపించి ప్రతీ జవాబు పత్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కృష్ణ ఆదిత్య ఆదేశించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక విద్యార్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించి రీ వాల్యువేషన్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రతీ విద్యార్థికి తాము రాసిన జవాబు పత్రం జిరాక్స్ ప్రతిని ఇంటర్ బోర్డు అందజేస్తుంది.

 

విద్యార్థులు రాసిన సమాధానాలకు మార్కులు కేటాయించకపోతే విద్యార్థి సవాల్ చేసే అవకాశం ఉంది. అలాకాకుండా మూల్యాంకనం జరుగుతున్న సమయంలో ఒక అధ్యాకుడు దిద్దిన జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులచేత పరిశీలింప చేయడం జరుగుతుందని సమాచారం. అయితే, ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని కొందరు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు.