Trump Tariffs: ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్.. బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ బంగారం ధరలపైనా పడింది.

Trump Tariffs
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే ప్రతీకార సుంకాల బాంబు పేల్చాడు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు ఉత్పత్తి అయ్యే వస్తువలపై భారీ మొత్తంగా ప్రతీకార సుంకాలు విధించారు. ట్రంప్ ప్రతీకార సుంకాలతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా సహా అన్ని ప్రధాన మార్కెట్లు పతనమవుతున్నాయి.
ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఆసియా మార్కెట్ల పై పడింది. గురువారం ఉదయం జపాన్ నిక్కీ ఏకంగా 3.4శాతానికి పైగా పడిపోయింది. భారతదేశం మార్కెట్లు కూడా గురువారం నష్టాలతోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్యూచర్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇదిలాఉంటే ట్రంప్ ప్రకటించిన 26శాతం సుంకాల ప్రభావాన్ని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ప్రపంచ మార్కెట్లపై పడగా.. ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. ఫలితంగా గోల్డ్ రేటు మరింత పెరుగుతోంది. ఇప్పటికే బంగారం ధర సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. తాజాగా.. ట్రంప్ సరికొత్త టారిఫ్ ల ప్రభావంతో అమెరికా మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర పెరిగింది. ప్రస్తుతం అక్కడ 3,145.65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఒక దశలో 3,167 డాలర్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది.
డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం భారత్ లోని బంగారం ధరలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు 92,830 వద్ద కొనసాగుతుంది. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ కారణంగా గోల్డ్ రేటు రూ.93వేలు దాటి సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.