Vangaveeti Radha : వంగవీటి రాధాకు కీలక పదవి..! కాపులకు సీఎం చంద్రబాబు పెద్దపీట..
క్యాబినెట్ లోకి తీసుకుంటామని గతంలోనే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Vangaveeti Radha : ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు పెద్ద పీట వేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే సోమువీర్రాజు, కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. తాజాగా కాపు సామాజికవర్గానికి చెందిన మరో కీలక నేత వంగవీటి రాధాకు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు రాధాతో చంద్రబాబు మాట్లాడారు. అంతేకాదు త్వరలో వంగవీటి రాధాకు చంద్రబాబు కీలక పదవి ఇవ్వనున్నారని సమాచారం. ఆ మేరకు రాధాతో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇవాళ కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన నాగబాబు.. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని గతంలోనే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : ఆ ఆరుగురు మాజీ మంత్రులపై చర్యలు తప్పవా.. అధికారుల పాత్ర ఎంత.. ప్రజాప్రతినిధులు దోచినదెంత?
ఇక వంగవీటి రాధాకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని గతంలోనే చెప్పారు చంద్రబాబు. ఎమ్మెల్సీలుగా కాపు సామాజికవర్గ నేతలకు అవకాశం కల్పించడం ద్వారా కాపుల్లో పట్టు సాధించనున్నారు చంద్రబాబు. ఇప్పుడు రాధాతో చంద్రబాబు భేటీ ఆసక్తికరంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల ఇచ్చిన ఎమ్మెల్సీ పదవుల్లో సామాజిక సమీకరణాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. అతి త్వరలో కీలక పదవి ఇవ్వనున్నట్లు రాధాకు సీఎం చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. చంద్రబాబుతో జరిగిన చర్చ గుడ్ మూడ్ తో ఉందని తన సన్నిహితులతో రాధా చెప్పినట్లు తెలుస్తోంది.