అధినేతల దోస్తీ.. లీడర్ల కుస్తీతో నిత్యం వార్తల్లో కూటమి.!
131 సీట్లు గెలిచిన పార్టీ ఒకటి. పోటీ చేసిన అన్ని సీట్లలో 21కి 21 సీట్లు గెలిచిన పార్టీ ఇంకోటి.

TDP vs Janasena A rift among local leaders of the alliance
Gossip Garage : 131 సీట్లు గెలిచిన పార్టీ ఒకటి. పోటీ చేసిన అన్ని సీట్లలో 21కి 21 సీట్లు గెలిచిన పార్టీ ఇంకోటి. థర్టీ పొలిటికల్ ఇయర్సీ లీడరు ఓ నాయకుడు. తన చరిష్మాతో కూటమికి అధికారం దక్కడంలో కీరోల్ ప్లే చేసిన నేత మరొకరు. ఇలా ఎవరి బలం వారికుంది. అయినా ఆ ఇద్దరు లీడర్లు మాత్రం కలసి నడుస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడా ఇగోకు పోవడం లేదు. తనకంటే జూనియర్ అని పవన్‌ను తీసేయడం లేదు సీఎం చంద్రబాబు. తన ఎంటైర్ పొలిటికల్ లైఫ్‌లో ఇప్పటివరకు ఏ నేతకు ఇవ్వనంత ప్రయారిటీ పవన్‌కు ఇస్తున్నారు చంద్రబాబు. పవన్ కూడా తానో పెద్ద స్టార్‌నని గొప్పలకు పోవడం లేదు. తనకు అడ్మినిస్ట్రేషన్‌పై పట్టులేదని..చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటున్నారు. అలా ఇద్దరు రాష్ట్రస్థాయిలో సఖ్యతతో ఉండి..దోస్తీని మెయింటెన్ చేస్తున్నారు. కూటమిలో కీలక పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన లీడర్లు మాత్రం ప్రతీ చిన్నదానికి గొడవ పడుతూ రచ్చకెక్కుతున్నారు.
ఒక సెగ్మెంట్‌లో ఇష్యూ మర్చిపోకముందే మరో నియోజకవర్గంలో ఏదో ఒక గొడవ జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా కాకినాడ పంచాయితీ తెరమీదకు వచ్చింది. కాకినాడ సిటీ సంజయ్ నగర్‌లో ఒక వైన్ షాపు కోసం మొదలైన వివాదం పెద్దగవుతోంది. వైన్ షాపు లీజు తాను తీసుకున్నాననంటే అంటే తాను తీసుకున్నానని టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి.. మరోపక్క ఎంపీ అనుచరుడు దొరబాబు అండగా ఉండి చక్రం తిప్పారు. కాకినాడ ఎంపీ ఎమ్మెల్యేలు తెరవెనక ఉండి వ్యవహారం నడిపిస్తున్నప్పటికీ.. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇప్పటివరకు ఎలాంటి గొడవ పడలేదు. ఇద్దరి అనుచరులు మాత్రం రోడెక్కుతున్నారు.
ఆ గొడవను మరవక ముందే మరో వివాదం రోడ్డుపైకొచ్చి నిరసన చేసే స్థాయికి దిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు విషయంలో మరోసారి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదం బహిర్గతమైంది. టీడీపీ నేతలు సిటీ అధ్యక్షుడు మల్లెపూడి వీరు ఆర్డీవో ఆఫీస్ ఎదుట రోడ్డుపై పడుకుని ఐదు గంటల అలజడి సృష్టించారు. కాకినాడలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానై ఇటు కూటమికి అటు అధినేతలకు తలపోటుగా మారింది. ఇద్దరి నేతల అనుచరులు మాత్రం తమ మాటే నెగ్గాలని పట్టుతో ఉన్నారు. అయితే ఈ రాజకీయ ఎత్తుగడలన్నీ ఎంపీ ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతున్నాయన్న చర్చ ఉంది. కాకినాడ సిటీలో పట్టు సాధించేందుకు అనుచరులతో వైరానికి దిగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఎంపీ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ SVSS వర్మ వర్గాల మధ్య వార్ నడిచింది. అధినేతల జోక్యంతో ఆ వివాదానికి పుల్ స్టాప్ పడింది.
అంతకముందు ధర్మవరం కూటమిలో మున్సిపల్ ఛైర్మన్ ఇష్యూ రచ్చకు దారి తీసింది. టీడీపీ నేతలు ధర్నా చేయడం మంత్రిని అడ్డగించడం వరకు వెళ్లింది వ్యవహారం. చివరకు ఆ అధికారి ట్రాన్స్‌ఫర్ తర్వాత అంతా సర్ధుకుంది. ఇలా బయటపడి కొంత..అంతర్గత గొడవలతో ఇంకొంత కూటమి పంచాయితీ అధినేతలకు తలనొప్పిగా మారింది. ఎవరో రాష్ట్ర స్థాయి నేత ఇన్వాల్వ్ అయి చక్కదిద్దేవరకు రచ్చ చేస్తున్నారు లోకల్ లీడర్లు. దీంతో ఐదేళ్ల పాటు పరిస్థితి ఏంటన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అధినేతల మధ్య సఖ్యత ఉన్నంత కాలం స్థానిక గొడవలు పెద్దగా ఇబ్బంది కలిగించవంటున్నారు నేతలు.