Botsa Satyanarayana : 3 నెలల తరువాత టీడీపీ ఉండదు.. కాంగ్రెస్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ : మంత్రి బొత్స

నియోజకవర్గాల మార్పులు రాజకీయాల్లో కొత్త కాదన్నారు. మంచి ఫలితాల కోసమే మార్పులు జరిగాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని తెలిపారు.

Botsa Satyanarayana : 3 నెలల తరువాత టీడీపీ ఉండదు.. కాంగ్రెస్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ : మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana

Updated On : December 14, 2023 / 5:45 PM IST

Minister Botsa Satyanarayana : టీడీపీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల తరువాత టీడీపీ ఉండదని, తుడుచుపెట్టుకుపోతుందన్నారు. చంద్రబాబుకి కుప్పం సీటుకే దిక్కు లేదని, ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తామని అంటున్నాడని తెలిపారు. టీడీపీ జాకీలు పెట్టినా లేవడం లేదని ఎద్దేవా చేశారు. చల్లని కాయిన్ అని చంద్రబాబు అనుకుంటే సరిపోతుందా అని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని పేర్కొన్నారు.

నియోజకవర్గాల మార్పులు రాజకీయాల్లో కొత్త కాదన్నారు. మంచి ఫలితాల కోసమే మార్పులు జరిగాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని తెలిపారు. అంచల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. తమకు ఒక విధానం ఉందని.. అలానే అమలు చేస్తున్నామని తెలిపారు.

TDP : ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల నమోదుపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ

మద్యం అంటే షాక్ కొట్టేలా చేస్తామని చెప్పామని, అలాగే చేస్తామని చెప్పారు. మద్యం తాగకుండా పబ్లిక్ లో పరివర్తన తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. మార్పుల వల్ల బీసీలకు మేలు జరిగిందన్నారు. జగన్ జనరల్ స్థానాల్లో బీసీలకు ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికే మార్పులు చేసినట్లు వెల్లడించారు.