Anantapur : విద్యార్థులను కూలీలుగా మార్చేసిన ఉపాధ్యాయులు
ఉరవకొడలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్వాకం.. జడ్పీ హై స్కూల్ లో టెన్త్ విద్యార్థులతో బెంచీలు మోయించిన టీచర్లు...

Zphs
Uravakonda District ZPHS : విద్యార్థులకు విద్యా బుద్ధులు నెర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. వారు ఏదైనా తప్పు చేస్తే.. సరిదిద్దాల్సిన బాధ్యత వారిదే. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను సన్మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యార్థులకు మార్గదర్శకుడు గురువు. సమాజానికి అవసరమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది పోయి.. ఇతర వాటికి వాడుకుంటున్నారు. చదువు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో వంటలు చేయించడం.. ఇతర పనులు చేయించిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. విద్యార్థుల చేత బెంచీలు మోయించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
Read More : Toy Train in Nirmal school : చిన్నారులూ..భలే భలే..టాయ్ ట్రైన్ లో బడికి పోదామా?
అనంత జిల్లాలోని ఉరవకొండ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 30వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ.. విద్యార్థులు కూర్చొనేందుకు బెంచీలు అవసరమయ్యాయి. సమీపంలో ఉన్న రేణుమాకులపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బెంచీలున్నట్లు తెలిసింది. దీంతో అక్కడి నుంచి ఇక్కడకు తేవాలని నిర్ణయించారు. బెంచీలను మోయించడానికి ఇతర వ్యక్తులను నియమించాల్సింది పోయి.. పదో తరగతి విద్యార్థులను ఉపయోగించుకున్నారు ఉపాధ్యాయులు.
Read More : Sudeep : హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో
రేణుమాకులపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఐచర్ వాహనంలో బెంచీలను తరలించారు. బెంచీలను పదో తరగతి విద్యార్థులు ఎత్తి వాహనంలో పెట్టారు. అక్కడి నుంచి ఉరవకొండ జిల్లా పరిషత్ కు చేరుకున్న తర్వాత.. వాటిని దింపి క్లాసు రూంలో పెట్టారు. మరో మూడు రోజుల్లో పబ్లిక్ పరీక్షలు పెట్టుకొని విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడమేంటని తల్లిదండ్రులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఉపాధ్యాయులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.