Nara Lokesh: టీమ్ లోకేశ్.. ఇటు మిస్సైల్స్.. అటు జీపీఎస్‌లు..!
యువగళం పాదయాత్రకు ముందు లోకేశ్‌ను చాలామంది లీడర్‌గా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. అదే లోకేశ్‌ను ఇప్పుడు ఫ్యూచర్ లీడర్‌గా..ఇక చిన్నబాబే తమ పార్టీ అధినేత అన్నట్లుగా చెప్పుకుంటున్నారు.
Nara Lokesh
Nara Lokesh: కూటమిలో ఆయనదే కీరోల్. ఏపీ సర్కార్‌ను నడిపించడంలో కూడా కీలక పాత్ర. తెలుగు దేశం పార్టీలో ఆయనే నంబర్ 2. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కీలక వ్యవహారాలన్నీ లోకేశ్ చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్‌గా టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం ఆసక్తికరంగా మారింది. 26 జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేశారు. రాష్ట్ర కార్యవర్గం కూర్పును పూర్తి చేశారు. ఇప్పటికే ఖరారు చేసిన 26 మంది ఎంపిక సమయంలో పార్టీ త్రిసభ్య కమిటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే టీడీపీ జిల్లా రథసారధుల లిస్ట్‌ను చూస్తే ఎక్కువగా కొత్తవారే ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది లోకేశ్ టీమ్‌లోని కీలక లీడర్లుగా చెబుతున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో క్యాస్ట్ ఈక్వేషన్స్‌కు, సీనియారిటీకి ప్రయారిటీ ఇవ్వడంతో పాటు యువనేతలకు ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీ హైకమాండ్. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోయేవారిలో సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి, మాజీ జడ్పీ ఛైర్మన్ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, కొమ్మాలపాటి శ్రీధర్, పిల్లి మాణిక్యాలరావు, బీద రవిచంద్ర, సుగవాసి ప్రసాద్ ఉన్నారు.
Also Read: Messi Match Row: నా మనవడిని అక్కడికి పంపను.. అందుకే మెస్సీ మ్యాచ్‌కు తీసుకెళ్లాను: రేవంత్ రెడ్డి
సేమ్‌టైమ్ యువతకు కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇచ్చారు. కిమిడి నాగార్జున, మోజోరు తేజోవతి, పట్టాభిరామ్, కోట్ని బాలాజీ, జ్యోతుల నవీన్, బొడ్డు వెంకటరమణ చౌదరి, గుత్తల సాయి, సలగల రాజశేఖర్, ఎంఎస్ రాజు, సి.భూపేష్ రెడ్డి వంటి వారు 40 నుంచి 50 ఏళ్ల మధ్యలోపు వారే. వీరంతా లోకేశ్ టీమ్‌గానే చెబుతున్నారు.
అందరూ యువనేతలే..
లోకేశ్ టీమ్ అంటే అంతా యువనేతలే. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోనూ యంగ్ లీడర్లు..దూకుడుగా పనిచేసే నాయకులే ఉన్నారు. అయితే 26 జిల్లా అధ్యక్షుల్లో పదికి పైగా జిల్లాలకు పార్టీ పగ్గాలు..యువ నేతలకు ఇచ్చారు. అయితే ఈ క్రమంలో వైజాగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లోకేశ్ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. యువ నాయకులంతా మిస్సైల్స్‌లాగా పనిచేస్తుంటే..సీనియర్ లీడర్లు జీపీఎస్‌లాగా డైరెక్షన్స్ ఇస్తున్నారని చెప్పారు లోకేశ్.
అంటే యువ నేతలంతా మిస్సైల్స్ లాగా దూసుకెళ్తుంటే ..సీనియర్ లీడర్లు జీపీఎస్ లాగా దారి చూపుతున్నారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఏ మిస్సైల్ టార్గెట్‌ను చేజ్ చేయాలన్నా జీపీఎస్ మస్ట్ అన్నారు లోకేశ్. ఏపీ అభివృద్ధికి యువనేతలంతా మిస్సైళ్లలా పనిచేస్తుంటే..సీనియర్ నాయకులు జీపీఎస్‌లా మార్గదర్శకత్వం చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు జీపీఎస్‌లైతే..కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు, తాను మిస్సైళ్లమని స్పష్టం చేశారు. అదే వేదికపై సీనియర్ లీడర్లు కూడా లోకేశ్‌కు ఎలివేషన్ ఇవ్వడం మరింత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అవుతోంది.
యువగళం పాదయాత్రకు ముందు లోకేశ్‌ను చాలామంది లీడర్‌గా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. అదే లోకేశ్‌ను ఇప్పుడు ఫ్యూచర్ లీడర్‌గా..ఇక చిన్నబాబే తమ పార్టీ అధినేత అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. తమ వారసులను కూడా లోకేశ్ వెంట నడిచేలా ప్రోత్సహిస్తున్నారు టీడీపీ లీడర్లు. దీంతో టీడీపీలో టీమ్ లోకేశ్ కీరోల్ అయిపోయింది. ఇష్యూ ఏదైనా..పార్టీలో ఏ చిన్న పాబ్లమ్ ఉన్నా ఇట్టే సమసిపోయేలా చేయడంతో పాటు..నో డౌట్స్, నో కన్‌ఫ్యూజన్స్..వీఆర్ వన్ అనే ఇండికేషన్స్ పంపిస్తున్నారు.
టీడీపీని మరో ముప్పై ఏళ్లు పవర్ ఫుల్ పార్టీగా ఉంచేలా..యంగ్ టీమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. సేమ్‌టైమ్ ఇప్పటివరకు ముప్పై ఏళ్లుగా పార్టీకి అండగా, పునాదుల్లా నిలిచిన నేతలను కూడా అదే స్థాయిలో గౌరవిస్తున్నారు. సలహాలు, సూచనలు మీవి..దూకుడుగా పనిచేసేది తామంటూ యువనాయకులతో స్ట్రాంగ్ ఫోర్స్‌గా నిలబడుతున్నారు లోకేశ్. ఈ స్ట్రాటజీ టీడీపీకి ఫ్యూచర్ బేస్డ్‌గా ఎంతో యూజ్ అవుతుందని..లోకేశ్ పనితీరు పార్టీకి రోజురోజుకు హైప్ తీసుకొస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
