Messi Match Row: నా మనవడిని అక్కడికి పంపను.. అందుకే మెస్సీ మ్యాచ్‌కు తీసుకెళ్లాను: రేవంత్ రెడ్డి

"మెస్సీ మ్యాచ్‌కి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మెస్సీ మ్యాచ్‌కు గెస్ట్ గానే నేను వెళ్లాను" అని అన్నారు.

Messi Match Row: నా మనవడిని అక్కడికి పంపను.. అందుకే మెస్సీ మ్యాచ్‌కు తీసుకెళ్లాను: రేవంత్ రెడ్డి

Updated On : December 18, 2025 / 7:42 PM IST

Messi Match Row: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ సందడి చేసిన వేళ అతడితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫుట్‌బాల్‌ ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు కూడా కనపడ్డాడు. దీనితో పాటు, మెస్సీ మ్యాచ్‌కి తెలంగాణ సర్కారు రూ.100 కోట్లు ఖర్చు చేసిదంటూ వచ్చిన విమర్శలపై రేవంత్ రెడ్డి స్పందించారు.

రేవంత్‌ రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “నా మనవడిని క్రీడాకారుడిని చేయాలనుకుంటుంన్నా.. అందుకే మెస్సీ మ్యాచ్ కు తీసుకెళ్లాను.. నా మనువడిని పబ్‌లకు, గబ్‌లకు పంపను. వాడిని స్పోర్ట్స్ మన్ చేస్తా. మెస్సీ మ్యాచ్‌కి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మెస్సీ మ్యాచ్‌కు గెస్ట్ గానే నేను వెళ్లాను” అని అన్నారు.

Also Read: ఈ ఊరి జనాభా 1,500 మాత్రమే.. వారు 3 నెలల్లో ఏకంగా 27,000 మంది శిశువులకు జన్మనిచ్చారంటూ..

“ఫూచర్ సిటీలో 3 వేల ఎకరాల్లో జూ పార్క్ అభివృద్ధి చేస్తాం. గ్లోబల్ టెండర్ ద్వారానే ప్రతి పనిపై ముందుకు వెళ్తాం. నామినేషన్‌లో ఎవరికి వర్క్స్ కట్టబెట్టం.. అలాచేస్తే ఎవరైనా జైలుకెళ్లాల్సిందే. గేమింగ్ స్టేడియాలు మొత్తం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తాం.

రాబోయే రోజుల్లో ఏయిర్‌పోర్ట్‌ సెంట్రిక్‌గా అభివృద్ధి జరుగుతుంది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో లెక్కలు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తున్నాం. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు హరీశ్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీఎం కావచ్చు” అని అన్నారు.

కాగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) పూర్తిగా ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.