రాజధాని బిల్లు : గవర్నర్ ముందు ఆప్షన్లు..తెలకపల్లి రవి ఏం చెప్పారంటే

ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్‌కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్పాటు విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు.
ఇక గవర్నర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న సంశయం అధికార, ప్రతిపక్ష నేతల్లో మొదలైంది. ఈ అంశంపై 10tvలో జరిగిన చర్చా వేదికలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఆయన ఏమన్నారంటే : –
రాజధాని తరలించడం అవసరమా అనేది ఒక ప్రశ్న తలెత్తుతోంది. మూడు రాజధానులు అనేది చెప్పడం లేదు..వికేంద్రీకరణ చెబుతోంది. ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలించడం అనేది ప్రధానమైన అంశం. ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని వికేంద్రీకరణ అని చెప్పారు. ఉల్లంఘించడం, దాటేస్తారనేది జరగకపోవచ్చు.
రాజధాని ఏర్పాటు శాసనసభకే : –
రాష్ట్రపతి బిల్లులను వెనక్కి తిరిగి పంపవచ్చు..రాజ్యాంగం చెబుతోంది. కానీ ఇక్కడ కేంద్రం పెద్దలు చెబుతున్నది ఏంది అంటే…రాష్ట్రానికి సంబంధించిందని, తాము జోక్యం చెప్పలేమని చెబుతున్నారు. విభజన చట్టం అనేది ఒక బలహీనమైన వాదన. రాజధాని ఏర్పాటు అనేది ఆ రాష్ట్ర శాసనసభకు వదిలేస్తారు.
దేశంలో శాసన ప్రక్రియ నడుస్తుందా : –
జగన్ ప్రభుత్వం ఉందా చంద్రబాబు ప్రభుత్వం ఉందా ? అనే విషయం కాదు. ఇక్కడ శాసనసభ ఉంది. సభ మెజార్టీ ఆమోదించడం అనేది ముఖ్యం. విజయవాడ – గుంటూరు మధ్యలో రాజధాని అని చెప్పారు ఆనాడు బాబు. సెలక్ట్ కమిటీ
భారతదేశంలో ఆరు చోట్ల శాసనమండలి ఉంది. రాజ్యాంగం చాలా పరిమితమైంది. శాసనసభ మండలి ఛైర్మన్ ఇలా..సెలెక్ట్ కమిటీకి పంపించి..ఆపేస్తుంటే..రాజ్యాంగం ఒప్పుకుంటే..దేశంలో శాసన ప్రక్రియ నడుస్తుందా ?
వికేంద్రీకరణ బిల్లులు ఆపేసే పరిస్థితి లేదు : –
ఇక్కడ టీడీపీ సభ్యుడు యనమల ప్రవేశపెట్టిన ఓ పద్దతి సెలెక్ట్ కమిటీ పేరిట డిలే చేయడం. ఇప్పుడు గవర్నర్ కు లేఖలు రాస్తున్నారు. ఇందులో చాలా లొసుగులున్నాయి. రాజ్యాంగబద్ధంగా చూస్తే..వికేంద్రీకరణ బిల్లులు ఆపేసే పరిస్థితి లేవు. రాష్ట్రపతికి పంపించవచ్చు. కానీ 200వ ఆధికరణ కింద రాష్ట్రపతి ఆపుతారా ? అనేది ప్రశ్న. వెనక్కి పరిస్థితి పంపించే పరిస్థితి లేదు ఇప్పుడు. రాజకీయ అభిప్రాయాలు వేరు,
ఏపీ బీజేపీది డబుల్ గేమ్ : –
అమరావతిని అందరూ కలిసి భ్రమరావతిగా మార్చారు.
ఏపీ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది. కేంద్రంలో ఒక మాట మాట్లాడుతుంటే..రాష్ట్రంలో మరోక విధంగా మాట్లాడుతున్నారు. మాకేం సంబంధం లేదని ఏపీ బీజేపీ ఇన్ ఛార్జీ మొన్ననే చెప్పారుగా. పార్టీ తరపున చెప్పారు..కేంద్రం తరపున చెప్పలేదు. బీజేపీకి పరాకాష్ట కన్నా లేఖ రాయడం. స్ట్రైట్ గా కేంద్రానికి లేఖ రాయవచ్చు కదా ? రాజధాని మా పరిధిలో లేదని రామ్ మాధవ్ కూడా చెప్పారు’. అని తెలకపల్లి అన్నారు.