ఏపీ, తెలంగాణలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 01:38 PM IST
ఏపీ, తెలంగాణలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Updated On : May 9, 2019 / 1:38 PM IST

ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

రెండు రాష్ట్రాల్లో వాతావరణం తేమగా ఉంటుందని ఐఎండి అధికారులు తెలిపారు. ఫొని తుఫాన్ కారణంగా వేడి తీవ్రత పెరిగిందన్నారు. ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, జగిత్యాలలో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే శుక్రవారం (మే 10, 2019) వరకు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలంగాణాలో హెచ్చరికలు జారీ చేశారు.