టెన్షన్ @ 27 : రాజధానిపై AP కేబినెట్ ఏం తేల్చబోతోంది

అమరావతిపై అధికారిక నిర్ణయానికి సమయం దగ్గర పడుతోంది. మూడు రాజధానులకు ఏపీ కేబినెట్ అధికారిక ముద్ర వేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. గత 9 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు కేబినెట్ ప్రకటన అనంతరం సద్దుమణుగుతాయా ? రాజధానికి వేల ఎకరాలు భూములు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటీ ? విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే..కార్యాలయాలకు భవనాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఏపీ ప్రజల్లో తలెత్తుతున్నాయి.
వేడేక్కిన రాజధానిలోనే ఏపీ కేబినెట్ సమావేశం జరుగబోతోంది. 2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సీఎం అధ్యక్షతనలో జరిగే ఈ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించనన్నారు. ప్రధానంగా రాజధాని ప్రకటన, జీఎన్ రావు కమిటీపై చర్చించనున్నారని తెలుస్తోంది. రాజధానిలోనే ఈ సమావేశం జరుగుతుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన కీలక ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. మూడు రాజధానులంటూ ఆయన ప్రకటన, GN RAO కమిటీ నివేదిక రాజధాని ప్రాంతాల్లో హీట్ పుట్టించింది. గత కొద్ది రోజులుగా రగడ కొనసాగుతోంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, ఇతరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తమ వద్దకే వస్తుందని విశాఖ వాసులు, హైకోర్టు రావడం పట్ల..కర్నూలు జిల్లా సంబరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలు చల్లపర్చడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మీడియా సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీలో నెంబర్ 2గా పిలుచుకొనే విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశం కూడా జరిగింది. మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ నివేదికపై కామంట్స్ చేశారు. అనంతరం మంత్రులు కూడా మాట్లాడారు.
GN RAO కమిటీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అమరావతిలో ఆందోళనలను ఎలా చల్లార్చలనే దానిపై వ్యూహాత్మకంగా వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని..అనంతరం వివరాలు వెల్లడిస్తామని మంత్రి బోత్స ప్రకటించారు. రాజధానికి రైతులు ఇచ్చిన భూములను ఏం చేస్తామో రానున్న రోజుల్లో చూడాలని, ఎలాంటి భయం అక్కర్లేదని ఆయన భరోసా ఇస్తున్నారు. మరి అధికారి పార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయా ? అమరావతిలో ఆందోళనలు చల్లారుతాయా ? అనేది చూడాలి.
Read More : రాజధానిపై ప్రకటన : అమరావతి రైతులు భయపడొద్దు – బోత్స