పొదిలిలో జగన్ టూర్.. మహిళలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడి… నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్

"సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చార"ని అన్నారు.

పొదిలిలో జగన్ టూర్.. మహిళలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడి… నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్

Updated On : June 11, 2025 / 4:08 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

“పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. జగన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశే. మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై వైసీపీ చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగాక్షమాపణలు చెప్పాలి” అని నారా లోకేశ్ అన్నారు.