Assassination Attempt In Ibrahimpatnam : ప్రియురాలి భర్తపై ప్రియుడు పట్టపగలే దాడి..లారీతో ఢీకొట్టి హత్యాయత్నం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో హత్యాయత్నం కలకలం రేపింది. ప్రియురాలి భర్తపై ప్రియుడు పట్టపగలే దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీనివాస్ నడుచుకుంటూ వెళుతుండగా.. శ్రీనివాస్ భార్య ప్రియుడు శంకర్ వెనుక నుంచి లారీతో వచ్చి చంపాలని ప్రయత్నించాడు.

Assassination Attempt In Ibrahimpatnam
Assassination Attempt In Ibrahimpatnam : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో హత్యాయత్నం కలకలం రేపింది. ప్రియురాలి భర్తపై ప్రియుడు పట్టపగలే దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీనివాస్ నడుచుకుంటూ వెళుతుండగా.. శ్రీనివాస్ భార్య ప్రియుడు శంకర్ వెనుక నుంచి లారీతో వచ్చి చంపాలని ప్రయత్నించాడు.
వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్ ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. తనపై దాడి చేసింది ఎవరా అని తెలుసుకునేందుకు లారీల స్టాండ్ వద్దకు వెళ్లాడు. శ్రీనివాస్‌ని గమనించిన నిందితుడు శంకర్.. అప్పుడు తప్పించుకున్నావు.. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారంటూ పక్కన ఉన్న సిమెంట్ రాయితో దాడి చేశాడు.
Extra Marital Affair : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి అపస్మార స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే స్పందించి శ్రీనివాస్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వివాహేతర సంబంధమే ఈ హత్యాయత్నానికి కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.