తోపుదుర్తి వర్సెస్ కేతిరెడ్డి.. ధర్మవరంలో రాప్తాడు రాజకీయం.. ఇందుకేనా.?
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కన్ను ధర్మవరంపై పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన ధర్మవరంపై కాస్త ఫోకస్ పెంచారట.

YSRCP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కొత్త వివాదానికి తెరదీశారు. ఓ వైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీతో అమీతుమీ అంటూ..రచ్చకెక్కుతున్న ప్రకాశ్‌రెడ్డి..ఆల్ ఆఫ్ సడెన్‌గా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి వైసీపీలోనే చర్చకు దారి తీశారు. రాప్తాడు వైసీపీ ఆఫీస్‌ను ధర్మవరంలో పెడుతానంటూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ చర్చనీయాంశంగా మారింది.
అయితే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కామెంట్స్‌పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఆఫీస్ పెట్టడం ఎందుకు..ఫోన్ ఎత్తి సమాధానం చెప్తే సరిపోతుంది కదా అంటూ సెటైర్ వేశారు. అంతే కాదు ముందుగా రాప్తాడులో పార్టీ ఆఫీస్ పెట్టుకోమనంటూ అంటూ కేతిరెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ప్రకాశ్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి మధ్య 2019 నుంచి కోల్డ్ వార్ నడుస్తోందట. అప్పట్లో మంత్రి పదవి విషయంలో ఇద్దరి మధ్య కాస్త డిఫరెన్సెస్ వచ్చాయట. అప్పట్లో జిల్లాలో కురుమ సామాజిక వర్గానికి మంత్రి పదవి రావడానికి, రెడ్డి సామాజిక వర్గానికి అమాత్యయోగం దక్కకపోవడానికి కేతిరెడ్డే కారణమని అని తోపుదుర్తి కినుక వహించారట.
Also Read: సెక్రటేరియట్‌లో అనధికార ఆంక్షలు? సిబ్బందికీ వణుకే? ఆ ఫ్లోర్ ఏది? అక్కడ ఎవరుంటారు?
దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ నడుస్తోందట. అదీకాక ధర్మవరం వైసీపీ టికెట్‌ను గోరంట్ల మాధవ్‌కు ఇప్పించాలని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కాస్త గట్టిగానే ట్రై చేశారట. ఈ ఇష్యూతో కేతిరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి మధ్య గ్యాప్ మరింత పెరిగిందట. గోరంట్ల మాధవ్ అనే ఆయుధాన్ని కేతిరెడ్డి తిరిగి ప్రకాశ్‌రెడ్డి వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అనంతపురం వైసీపీలో టాక్ వినిపిస్తోంది.
కురమ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ను రాప్తాడుపై ఫోకస్ పెట్టేలా వైపు దృష్టి పెట్టేలా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెనుకుండి ప్రోత్సహిస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి లోలోపల ఫీల్ అవుతున్నారట. దీంతో కేతిరెడ్డిని ఎలాగైనా కంట్రోల్ చేయాలని ఒక మార్గాన్ని ఎంచుకున్నారట. అందులోనూ ఇటీవల రాప్తాడు వైసీపీలో అసమతి స్వరం పెరిగిపోవడంతో దాన్ని తగ్గించుకునేందుకు..ధర్మవరంలో ఆఫీస్ పెడుతానంటూ ఓ అస్త్రాన్ని బయటికి తీశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రకాశ్‌రెడ్డి ఆలోచన ఏంటి?
రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలు అనంతపురం జిల్లా కేంద్రంకు దగ్గరగా.. మరో మూడు మండలాలు ధర్మవరం రెవెన్యూ డివిజన్‌కు దగ్గరగా ఉంటాయి. దీంతో ఆ మూడు మండలాల కోసం ధర్మవరంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఆ మూడు మండలాల మీటింగ్‌లు ధర్మవరంలో పెడుతాననేది ప్రకాశ్‌రెడ్డి థియరీ. అందుకు కేతిరెడ్డి ఎంతవరకు ఒప్పుకుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది.
ఎందుకంటే ఒక నాయకుని పార్టీ ఆఫీస్ మరొక పాపులర్ లీడర్ నియోజకవర్గంలో పెట్టడమంటే ఎవరైనా ఒప్పుకోరు. అయితే ప్రకాశ్‌రెడ్డి కామెంట్స్‌పై స్పందించిన కేతిరెడ్డి..తోపుదుర్తికి ధర్మవరంలో పార్టీ ఆఫీస్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తనకు తెలియదన్నారు. మొదట రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ పెట్టుకోమను అంటూ పరోక్షంగా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు కేతిరెడ్డి.
అయితే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కన్ను ధర్మవరంపై పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన ధర్మవరంపై కాస్త ఫోకస్ పెంచారట. మంత్రి సత్యకుమార్, టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదంతా ఎందుకా అని ఆరాతీస్తే..ధర్మవరం పాలిటిక్స్‌పై తోపుదుర్తి ఆసక్తి చూపిస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రాప్తాడు వైసీపీ ఆఫీస్‌ను ధర్మవరంలో పెట్టి..నెమ్మదిగా పావులు కదుపాలని ప్లాన్ చేశారట. కేతిరెడ్డి రియాక్షన్‌తో అది కాస్త బూమరాంగ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటున్నారు.