Lovebirds Threat: జ్యోతుల నెహ్రూ అనుచరుల నుండి ప్రాణహాని ఉంది: ప్రేమ జంట
జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరుల నుండి ప్రాణహాని ఉందంటు ఓ ప్రేమ జంట ఆదివారం విశాఖలో మహిళా సంఘాలను ఆశ్రయించింది

Lovers
Lovebirds Threat: జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరుల నుండి ప్రాణహాని ఉందంటు ఓ ప్రేమ జంట ఆదివారం విశాఖలో మహిళా సంఘాలను ఆశ్రయించింది. పోలీసులు స్పందించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన సుంకర సత్య అపర్ణ దేవి, పూరిపండా రవికిరణ్ లు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో జనవరి 4న హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం విశాఖ వెళ్లిన ఈ జంట అక్కడే గది అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు.
Also read: Crime News: దండుపాళ్యన్ని మించిన కర్నూలు గ్యాంగ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్
ఈక్రమంలో అపర్ణ తల్లిదండ్రులు.. తమ కూతురు కనిపించడం లేదంటూ జనవరి 6న జగ్గంపేట రూరల్ పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తన విషయంలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అనుచరులు బెదిరిస్తున్నారని..వారి నుంచి ప్రాణహాని ఉందంటూ అపర్ణ దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు స్పందించకపోవడంతో ప్రేమజంట మహిళా సంఘాలను ఆశ్రయించారు. దీంతో ప్రేమ జంటకు ప్రమాదం ఉందని, పోలీసులు తక్షణమే రక్షణ కల్పించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
Also read: Luxury Naxalites: నక్సల్స్ వద్ద ఆ కార్లను చూసి బిత్తరపోయిన పోలీసులు