Andhra Pradesh: దేశ వ్యాప్తంగా వచ్చిన తొమ్మిదింటిలో ఏపీలోని ఆ మూడింటికి మాత్రమే స్పెషల్ ట్యాగ్‌లు
దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలకు మాత్రమే వాటర్ ప్లస్ ట్యాగ్ ఇవ్వగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు సిటీలకు అవకాశం దక్కింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ట్యాగ్ లను..

Water Plus Tag
Andhra Pradesh: దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలకు మాత్రమే వాటర్ ప్లస్ ట్యాగ్ ఇవ్వగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు సిటీలకు అవకాశం దక్కింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ట్యాగ్ లను ఇష్యూ చేసింది. మిగిలిన రాష్ట్రాలకు ఒక్కో ట్యాగ్ మాత్రమే రాగా, కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఎక్కువ వాటర్ ప్లస్ ట్యాగ్ లు వచ్చినట్లు సీఎంఓ వెల్లడించింది.
స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా దీనికి సంబంధించి అవార్డు అందిస్తారు. ‘తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ (టీఎంసీ), విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్(వీఎంసీ), గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లకు సర్టిఫికేషన్ అందుతుందని’ చెప్పారు.
అమల్లో ఉన్న ప్రొటోకాల్స్ ప్రకారం.. ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ (ODF/ODF+, ODF++)అందుకున్న తర్వాత దశలోనే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ఉండే ఇళ్లు, కమర్షియల్ బిల్డింగులు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆధారంగా సర్టిఫికేషన్ ఇస్తారు. సీపీసీబీ నార్మ్స్ ప్రకారం.. వేస్ట్ వాటర్ వదిలే ముందు కొన్ని ట్రీట్మెంట్స్ పాటించాలి. అలా చేయడం వల్ల రీ యూజ్ చేయడానికి, రీ సైకిల్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి’ అని సీఎంఓ స్టేట్మెంట్ లో చెప్పింది.