Ananthapuram Accident : మద్యం మత్తులో డ్రైవింగ్, అతి వేగం ముగ్గురిని బలి తీసుకుంది

శనివారం తెల్లవారుజామున కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గంమధ్యలో తాడిపత్రి మండలం రావివెంకటపల్లెలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.

Ananthapuram Accident : మద్యం మత్తులో డ్రైవింగ్, అతి వేగం ముగ్గురిని బలి తీసుకుంది

Anantapur road accident

Updated On : August 5, 2023 / 8:37 AM IST

Ananthapuram Accident Three Died : ఏపీలో మద్యం మత్తు, అతి వేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన మోహన్ రెడ్డి ఇటీవలే కొత్త కారు కొనుగోలు చేశారు. దీంతో స్నేహితులతో కలిసి దావత్ చేసుకున్నారు.

దావత్ అనంతరం శనివారం తెల్లవారుజామున కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గంమధ్యలో తాడిపత్రి మండలం రావివెంకటపల్లెలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Bachupally Accident : హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

మృతులు మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నరేశ్ రెడ్డిగా గుర్తించారు. ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడికి గాయాలయ్యాయని తెలిపారు. మద్యం మత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.