Blast in Sugar Factory : కాకినాడ వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు..ముగ్గురు మృతి
Blast in Sugar Factory : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Blast in Sugar Factory
Blast in Kakinada district Sugar Factory : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరో ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
కన్వియర్ బెల్ట్ పేలి పేలుడు సంభవించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి..కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు.
కాగా ఫ్యాక్టరీలో పేలుడు ఈరోజు ఉదయమే జరిగితే..ఈ ఘటనను గోప్యంగా ఉంచేందుకు యాజమాన్యం యత్నిస్తోంది. లారీలకు లోడ్ చేసే కన్వియర్ బెల్ట్ కు పవర్ సప్లై ఒక్కసారిగా రావటంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గాయపడిన నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో కార్మికుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.