Tirumala : హనుమంతుని జన్మస్థలం నిర్ధారణ క్రమం ఎలా జరిగింది ?
తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఈ -మెయిళ్ల ద్వారా టీటీడీని కోరడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఈఓ...

birthplace of Hanuman
Tirumala Is Hanuman’s Birth Place : శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు విచ్చేస్తారని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. హనుమంతుని జన్మస్థలం అని నిర్ధారించడానికి విశేష కృషి జరిగింది. హనుమంతుని జన్మస్థలంగా తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఈ -మెయిళ్ల ద్వారా టీటీడీని కోరడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి 2020 డిసెంబరులో పండిత పరిషత్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, అప్పటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి కీ.శే. ఆచార్య మురళీధర శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానుమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ పండిత పరిషత్ పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ చేసింది. జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర లో ఆంజనేయుని జన్మ స్థలాలుగా అక్కడి వారు నమ్ముతున్న ప్రాంతాలను కూడా పండిత పరిషత్ పరిశీలించింది.
Read More : Ram Mohan Naidu : మీరు రాజీనామా చేస్తే మేమూ రెడీ.. వైసీపీ ఎంపీలకు టీడీపీ సవాల్
2021, ఏప్రిల్ 21న శ్రీరామనవమినాడు పూర్తి ఆధారాలతో హనుమంతుని జన్మస్థలం తిరుమల అని టీటీడీ నిరూపించింది. అప్పటి తమిళనాడు గవర్నర్ గౌ. శ్రీ భన్వారిలాల్ పురోహిత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం ప్రకటించడంతో పాటు బుక్ లెట్ కూడా టీటీడీ అధికారులు విడుదల చేశారు. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించారు. ఆ తరువాత తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2021, జూలై 30, 31వ తేదీల్లో టీటీడీ అంతర్జాతీయ వెబినార్ నిర్వహించింది. శ్రీ కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి, మహీంద్రా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల డీన్ శ్రీ మాడభూషి శ్రీధర్, అప్పటి జాతీయ సంసృత విశ్వవిద్యాలయం ఉప కులపతి, టీటీడీ పండిత పరిషత్ అధ్యక్షులు కీ.శే. ఆచార్య వి.మురళీధర్ శర్మ, జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె. మునిరత్నం, ఆచార్య శంకర నారాయణ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జాదవ్ విజయ కుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ శ్రీ ఎ. ప్రసన్న కుమార్, విశ్రాంత సంస్కృతోపన్యాసాకులు ఇ. సింగరాచార్యులు, చారిత్రక పరిశోధకులు శ్రీ గోపికృష్ణ వివిధ అంశాలపై మాట్లాడి అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిరూపించే ఆధారాలను తెలియజేశారు.
Read More : Tirupati : ఆంజనేయస్వామి జన్మస్థాన అభివృద్ధికి శంఖుస్థాపన.. ముహూర్తం ఖరారు
పురాణ ఆధారాలు అష్టాదశపురాణాల్లోని శ్రీ వేంకటాచలమాహాత్మ్యంలో స్పష్టంగా అంజనాద్రే హనుమ జన్మస్థలంగా ప్రతిపాదించబడింది. కృతయుగంలో వృషాద్రిగా, త్రేతాయుగంలో అంజనాచలంగా, ద్వాపరయుగంలో శేషశైలంగా, కలియుగంలో వేంకటాచలంగా తిరుమల ప్రసిద్ధి పొందిందని వ్యాస భగవానుడు ఉపదేశించాడు. అంజనాదేవి తపస్సు, వాయువు దేవుని కటాక్షంతో హనుమంతుడు జన్మించినట్లు స్కాంద, భవిష్యోత్తర, వరాహ, బ్రహ్మాండపురాణాల్లో వేంకటాచల మాహాత్మ్యఖండాల్లో వివరించబడ్డాయి. వాఙ్మయ, శాసన ఆధారాలు వాఙ్మయ, శాసన ఆధారాల ప్రకారం వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైన కంబ రామాయణం, శ్రీ వేదాంతదేశికులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు తమ రచనల్లో వేంకటాద్రిగా అంజనాద్రిగా అభివర్ణించారు. స్టాటన్ అనే అధికారి క్రీ.శ. 1800 సంవత్సరంలో తిరుమల గుడి గురించిన విషయాలను సంకలనం చేసి సవాల్-ఏ-జవాబ్ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో అంజనాద్రి అని పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటు కావడం వల్ల అంజనాద్రి అన్నారని రాసినట్లు గుర్తించారు. వేంకటాచల మాహాత్మ్యం అనే గ్రంథం ప్రమాణమే అని చెప్పటానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో దొరుకుతున్నాయి. ఇందులో మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీకి చెందినది, రెండవ శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదిగా గుర్తించారు.