TTD : తిరుమల కొండపై మందుబాబుల హల్ చల్
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిఘా వైఫల్యం బట్టబయలైంది. నాగాలాండ్‌కు చెందిన భక్తులు తిరుమల ఘాట్ రోడ్డు వద్ద మద్యం సేవిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. మద్యం బాటిళ్లతో వారు కొండపైకి ఎలా వచ్చిందనేది ప్రస్తుతం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలిపిరి వద్ద తూతూమంత్రంగా తనిఖీలు కొనసాగుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. వాహనాల తనిఖీల్లో విజిలెన్స్ వైఫల్యం ఈ వ్యవహారంతో వెలుగుచూసింది.

Ttd
Tirumala Vigilance Officers : అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిఘా వైఫల్యం బట్టబయలైంది. నాగాలాండ్‌కు చెందిన భక్తులు తిరుమల ఘాట్ రోడ్డు వద్ద మద్యం సేవిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. మద్యం బాటిళ్లతో వారు కొండపైకి ఎలా వచ్చిందనేది ప్రస్తుతం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలిపిరి వద్ద తూతూమంత్రంగా తనిఖీలు కొనసాగుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. వాహనాల తనిఖీల్లో విజిలెన్స్ వైఫల్యం ఈ వ్యవహారంతో వెలుగుచూసింది.
అలిపిరి..తిరుమల కొండ :-
అలిపిరి… తిరుమల కొండకు ఇదే ముఖద్వారం. వెంకన్న దర్శనానికి ఇదే గేట్ వే. ఇక్కడ ఉన్న సప్తగిరి తనిఖీ కేంద్రాన్ని దాటుకుని భక్తులు తిరుమల కొండపైకి వెళ్లాలి. దేశ ప్రముఖులు మినహా మరెవరికీ ఇక్కడ తనిఖీల నుంచి మినహాయింపు లేదు. కొండపైకి వెళ్లే ప్రతి వాహనాన్ని, భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిందే. ఇందుకోసమే ఇక్కడ టీటీడీ విజిలెన్స్, ఎస్‌పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉంటారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం ఇక్కడ వినియోగిస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్ నుంచి బ్రీఫ్ కేస్ వరకు ప్రతి ఒక్కటీ తనిఖీ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తారు. మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తులు, పేలుడు స్వభావం కలిగిన వస్తువులు తిరుమల కొండపైకి పూర్తిగా నిషేధం. ఎట్టి పరిస్థితుల్లోనూ కొండపైకి వీటిని అనుమతించరు. ఇక్కడ తనిఖీ కోసం పెద్ద సంఖ్యలో టీటీడీ విజిలెన్స్, కాంట్రాక్టు సిబ్బందిలు విధి నిర్వహణలో ఉంటారు.
నిబంధనలు :-
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తులతో గతంలో అనేక మంది పట్టుబడ్డారు. కొందరు దొంగచాటుగా కొండపైకి తీసుకెళుతూ పట్టుబడగా, కొంతమంది భక్తులు ఇక్కడ నిబంధనలు తెలియక మద్యం, సిగరేట్లతో వచ్చి దొరికిపోతారు. ఇక్కడ దొరికిన మద్యంను టీటీడీ విజిలెన్స్ సీజ్ చేస్తుంది. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తారు. కేవలం కేసులు, జరిమానా, శిక్ష అన్న వ్యవహారంలా కాకుండా, ఇలా చేయడం ఒక అపచారంలా భక్తులు భావించాలన్నది టీటీడీ భావన.
నాగాలాండ్ భక్తులు :-
ఇన్ని నిబంధనల నడుమ తిరుమల కొండపై పట్టుబడ్డ నాగాలాండ్ భక్తుల వ్యవహారం స్పెషల్ కేస్‌గా మారింది. నాగాలాండ్ భక్తులు కారులో మద్యం బాటిల్ తో ఏకంగా అలిపి తనిఖీ కేంద్రం దాటేశారు. వీరిని, వీరి వాహనాన్ని సరిగ్గా తనిఖీ చేయలేదని స్పష్టం అవుతోంది. మద్యం బాటిల్‌తో తనిఖీ కేంద్రం దాటిన వాళ్లు… అంతటితో ఊరుకోకుండా కొండ పైకి వెళుతూ కారులోనే మద్యం సేవిస్తూ ప్రయాణం కొనసాగించారు. మద్యం తాగుతూ కొండపైకి వస్తున్న వీరిని చూసి భక్తులు అవాక్కయ్యారు. వెంటనే టీటీడీ విజిలెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో కింద నుంచి కొండపైకి వచ్చిన విజిలెన్స్ సిబ్బంది ఘాట్ రోడ్ లోనే వీరిని అదుపులోకి తీసుకున్నారు.
టీటీడీ ఉన్నతాధికారుల సీరియస్ :-
పట్టుబడ్డ భక్తులు చెప్పిన సమాధానం విని అవాక్కవుతున్నారు. అలిపిరి వద్ద తమను సరిగ్గా తనిఖీ చేసి, మద్యం బాటిల్ సీజ్ చేసి ఉంటే తాము ఈ పని చేసి ఉండేవారం కాదు కదా అంటూ సమర్ధించుకున్నారు నాగాలాండ్ భక్తులు. తమకు తిరుమల నిబంధనలు తెలియవని, పొరపాటు చేశామన్నారు. అలిపిరి వద్ద తనిఖీలు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ వ్యవహారాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిమిషాల వ్యవధిలో రెండు ఘటనలు :-
మరో వైపు తిరుపతికి చెందిన ఓ యువకుడు బైక్‌లో రహస్యంగా మద్యం బాటిళ్లు దాచి కొండపైకి వెళుతూ అలిపిరి వద్ద అడ్డంగా దొరికిపోయాడు. బైక్ సీట్ కింద దాచిన 14 మద్యం బాటిళ్లను టీటీడీ విజిలెన్స్ స్వాధీనం చేసుకుంది. గతంలోనూ ఈ యువకుడు కొండపైకి మద్యం తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయించినట్లు విజిలెన్స్ గుర్తించారు. తిరుమలలో కొందరు స్థానికులకు, భక్తులకు ఇతను విక్రయిస్తున్నట్లు భావిస్తున్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరగడం సంచలనంగా మారింది.