తిరుమల ఘాట్ రోడ్‌లో మళ్లీ ఆంక్షలు.. కారణం ఏంటంటే..
నిన్న రాత్రి 55, 56వ మలుపు వద్ద బైక్ పై వెళ్తున్న కొందరికి చిరుత పులి కనిపించింది. భయాందోళనకు గురైన వాహనదారులు వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Tirumala Ghat Road Restrictions : తిరుమల ఘాట్ రోడ్ లో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం కలకలం రేపడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్ 56వ మలుపు వద్ద వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులకు వాహనదారులు సమాచారం అందించారు. గతంలోనూ తిరుమలలో చిరుతలు కలకలం రేపాయి. పలువురు భక్తులపై దాడి చేశాయి. దీంతో కొన్నింటిని అటవీశాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
తిరుమల ఘాట్ రోడ్లలో బైక్ ల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి 55, 56వ మలుపు వద్ద బైక్ పై వెళ్తున్న కొందరికి చిరుత పులి కనిపించింది. భయాందోళనకు గురైన వాహనదారులు వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఆ వెంటనే భక్తులను అప్రమత్తం చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా బైక్ ల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ 2 నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని, భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జంతువులు సంతానోత్పత్తి కోసం అటు ఇటు తిరుగుతుంటాయని, రోడ్లు దాటే పరిస్థితి కూడా ఉంటుందని, ఈ క్రమంలో వాటికి ఇబ్బంది కలగకుండా సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని టీటీడీ అటవీశాఖ. మొత్తంగా రాత్రి పూట ద్విచక్ర వాహనాలను అయితే అనుమతించరు.
Also Read : దివ్వెల మాధురి కారు ప్రమాదం ఘటనలో సరికొత్త ట్విస్ట్