TTD: వెనుకబడిన వర్గాలకు శ్రీవారి ఉచిత దర్శనం.. టీటీడీ నిర్ణయం!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బడుగుబలహీన వర్గాలకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది టీటీడీ.

TTD: వెనుకబడిన వర్గాలకు శ్రీవారి ఉచిత దర్శనం.. టీటీడీ నిర్ణయం!

Ttd

Updated On : October 8, 2021 / 8:44 AM IST

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బడుగుబలహీన వర్గాలకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది టీటీడీ. ప్రభుత్వ పథకాల లబ్దిదారులుగా గుర్తించినట్లు వెనుకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం కూడా ఉచితంగా ఇచ్చేందుకు టీటీడీ బోర్డు ప్రణాళికలు వేస్తుంది. కులాల పరంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో వెయ్యిమందికి ప్రతిరోజూ సకల మర్యాదలతో శ్రీవారి దర్శనాన్ని చేయించాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

అయితే అన్ని రోజులూ కాదు కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే. వెనుకబడిన వర్గాల వారికి ఈ అవకాశం కల్పిస్తోంది టీటీడీ. కులాల లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం ఇవ్వనుంది టీటీడీ. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం చిత్తూరు, కడప జిల్లాల నుంచి దాదాపు 950 మంది భక్తులను 20 బస్సుల్లో తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించారు.

టీటీడీ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా అక్టోబర్ 14వ తేదీ వరకు ఆయా భక్తులను ఉచితంగా బస్సుల్లో తిరుమలకు తీసుకొచ్చి దర్శనం చేయించనున్నారు. ఒక్కో జిల్లాకు పది, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు 20 చొప్పున బస్సులు ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా భక్తులను తీసుకుని వచ్చి టీటీడీ దర్శనం కల్పించనుంది టీటీడీ.