Bhargav Case : టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్టులు..14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం

టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెసుకున్న దిశా పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

Bhargav Case : టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్టులు..14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం

Twists In Tiktok Fame Fun Bucket Bhargav Case

Updated On : April 21, 2021 / 9:27 AM IST

TikTok Fame Fun Bucket Bhargav case : టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెసుకున్న దిశా పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. టిక్ టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చిన భార్గవ్.. చెల్లి చెల్లి అని పిలుస్తూనే 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఇటీవల ఫిర్యాదు అందింది.

ఈ కేసులో భార్గవ్‌ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అతడి కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. అతడి బాధితుల లిస్టులో చాలామంది యువతులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దిశ పోలీసులు అతనిని రిమాండ్‌కు తరలించారు

టిక్‌టాక్‌తో పాటు మీడియాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. 14 ఏళ్ల మైనర్‌ బాలికను ఫన్‌బకెట్‌ భార్గవ్‌ గర్భవతిని చేశారన్నారు దిశ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని… ఆ అమ్మాయి నో చెప్పినా భార్గవ్‌ వినలేదని తెలిపారు. దుస్తులు మార్చుకునేటప్పుడు తీసిన ఫోటోలు ఉన్నాయంటూ బెదిరించి లోబరుచుకున్నాడని వెల్లడించారు.

భార్గవ్‌ను అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇలాంటి వారిపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు దిశ ఏపీసీ ప్రేమ్‌కాజల్‌. మరోవైపు భార్గవ్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నిత్య. భార్గవ్‌ నిత్యపైనే అత్యాచారం చేశాడని కొన్ని యూట్యూబ్‌ చానళ్లు ఫేక్‌ ప్రచారం చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.